ఉన్నది ఒకటే జిందగి మూవీ రివ్యూ

Vunnadhi Okate Zindagi Telugu review

Vunnadi Okate Zindagi movie review in Telugu

Vunnadi Okate Zindagi movie review and rating :

 • విడుదల తేదీ: అక్టోబర్ 27, 2017
 • ఉన్నది ఒకటే జిందగి రేటింగ్ : 3/5
 • దర్శకత్వం : కిషోర్ తిరుమల
 • నిర్మాత : కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్
 • సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
 • నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి
 • బ్యానర్ : స్రవంతి రవి కిషోర్, పి.అర్ మూవీస్
 • సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
 • ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్

“ఉన్నది ఒకటే జిందగీ” సినిమాతో మరోసారి రామ్ పోతినేని మరియు కిషోర్ తిరుమల చేతులు కలిపారు. వీరి కలయికలో వచ్చిన “నేను శైలజ” మంచి విజయాన్ని సాధించింది. నేను శైలజ తర్వాత రామ్ నటించిన హైపర్ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయం పై రామ్ పూర్తి నమ్మకంతో వున్నాడు. మరి రామ్ నమ్మకాన్ని ఈ చిత్రం ఏమేరకు నిలబెట్టగలదో మన రివ్యూలో చూద్దాం.

కథ:

అభి (రామ్ పోతినేని) వాళ్ళ అమ్మ అతని చిన్న తనం లో నే చనిపోతుంది. అదే సమయం లో అభి కి వాసు (శ్రీ విష్ణు) పరిచయం అవుతాడు. అలా వాళ్ళు చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ గా పెరుగుతారు. వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాసు ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్తాడు. అదే సమయం లో అభి కి మహా (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. అభి మహా ని ఇష్టపడతాడు. అదే సమయం లో వాసు ఢిల్లీ నుండి తిరిగివస్తాడు. తనని చూద్దాం అని వాసు వాళ్ళ ఇంటికి వెళ్లిన అభికి మహా వాసు వాళ్ళ మరదలు అని తెలుస్తుంది. వాసు కూడా మహా ని ఇష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు ఎం చేశారు ? మహా ఎవరికి దక్కింది ? ఒకరికి మహా దక్కితే ఇంకొకరు ఎం అయ్యారు ? లావణ్య త్రిపాఠి ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే తెర పైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

డైరెక్టర్ కిషోర్ తిరుమల తీసుకున్న స్టోరీలైన్ పాతదే అయినప్పటికీ దానిని తెర పైన చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడిని అలరించడం లో డైరెక్టర్ కిషోర్ తిరుమల సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ప్రతి ఫ్రెండ్షిప్ లో వుండే కామన్ పాయింట్ ని తీసుకుని దానినే తన సినిమాకు ఊపిరి గా మలుచుకున్నారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ప్రేమ, స్నేహం ప్రతి మనిషి జీవితంలో కామన్, కానీ వాటిని మనం ఎలా బాలన్స్ చేసుకోవాలి అనే విషయాన్నీ చాలా బాగా చూపించాడు మన డైరెక్టర్.

ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ పాత్రలలో రామ్ పోతినేని మరియు శ్రీ విష్ణు జీవించేసారు. మహా పాత్ర లో అనుపమ పరమేశ్వరన్ తన నటనతో ఆకట్టుకుంది. వెడ్డింగ్ ప్లానర్ గా లావణ్య త్రిపాఠి సినిమాలో అలరించింది. పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో మళ్ళీ రెచ్చిపోయాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులని అలరించాయి. వాటిని తెర పైన ఇంకా బాగా తెర కెక్కించాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరొక ప్రత్యేక ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. స్రవంతి రవి కిషోర్, పి.అర్ మూవీస్ వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఈ సినిమాకి ప్రధానమైన పాయింట్ అభి వాసు ల స్నేహం, కానీ దర్శకుడు కిశోర్ తిరుమల ఆ స్నేహ బంధాన్ని కొన్ని సీన్స్ లో చూపించారు కానీ, ఆ స్నేహాన్ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తే బాగుండేది. సినిమా మొదటి భాగంలో మొదటి 30 నిముషాల వరకు కొద్దిగా నెమ్మదిగా నడుస్తోంది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. రొటీన్ గా సింపుల్ గా తేల్చేసిన క్లైమాక్స్, అప్పటికే ఒకసారి ప్రేమలో విఫలమైన అభి బలమైన కారణాలు ఏమి లేకుండానే రెండోసారి సులభంగా ప్రేమలో పడిపోవడం అనే అంశాలు కొంత వరకు నిరుత్సాహ పరిచేవే.

ఓవరాల్ గా “ఉన్నది ఒకటే జిందగీ” స్నేహం కోసం ప్రాణం ఇచ్చే ఇద్దరి ఫ్రెండ్స్ కధ.

ప్లస్ పాయింట్స్:

 • స్టోరీ లో కొత్త దనం
 • నటి నటుల నటన
 • పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

 • ఫస్ట్ హాఫ్ లో కొంత లాగ్
 • రొటీన్ క్లైమాక్స్

రేటింగ్: 3/5

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

 

Click here for Vunnadi Okate Zindagi Movie Review in English

Add Comment

Click here to post a comment