రామ్ “ఉన్నది ఒక్కటే జిందగీ” ఆడియో

Vunnadhi Okate Zindagi movie Audio Function

Vunnadhi Okate Zindagi movie Audio Function

కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ఉన్నది ఒక్కటే జిందగీ‘ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ఈ సినిమా పాటలను, ట్రైలర్ ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నది చిత్ర బృందం. కాగా, ఈ నెల 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఇదివరకే ప్రకటించారు.

జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడని నమ్మే యువకుడు అభిరామ్. నలుగురు స్నేహితులతో కలిసి రాక్ బ్యాండ్ ను ప్రారంభిస్తాడు. ఆ రాక్ బ్యాండ్ కి అతనే లీడర్. చిన్నప్పటి నుంచి సాఫీగా సాగిపోతున్న అలాంటి అభిరామ్ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిల్లో ఎవరితో అభిరామ్ ప్రేమలో పడ్డాడు? ఇంతకీ అభిరామ్ కథేంటి? అనేది మా చిత్రంలో చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల.

ప్రస్తుతం ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా, ఆడియో వేడుక ముహూర్తంని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ నెల 13న హైదరాబాద్ లో ఆడియో వేడుకని నిర్వహించనున్నారు.అదే రోజున వేదిక మీద థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేస్తామని తెలిపింది.

Vunnadhi Okate Zindagi movie Audio Function

ఇప్పటికే రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ సినిమాతో మంచి హిట్ ని సాధించారు. ఆ తర్వాత రామ్ హైపర్ చేసినప్పటికీ అంతగా విజయాన్ని సాధించలేకపోయింది. ఇక మరల ఈ డైరెక్టర్ తో ఈ సినిమాతో ముందుకొస్తున్నాడు రామ్.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ- ”ఇటలీలో రామ్ పై చిత్రీకరించిన సన్నివేశాలతో చిత్రం మొత్తం పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో రామ్ అద్భుతంగా నటించాడు. యువతరాన్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని” తెలిపారు.

కిశోర్ కథ, కథనం, దర్శకత్వం..ప్రతిదీ కొత్త పంథాలో ఉంటుంది. “రామ్, కిశోర్ తిరుమల కలయికలో మేం నిర్మించిన ‘నేను శైలజ’ తరహాలో ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకుంటుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మరియు ట్రైలర్ ను ఈ నెల 13 న విడుదల చేసి ఈనెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం” ఈ చిత్ర బృందం తెలిపింది.

Add Comment

Click here to post a comment