విజయ్ ఆంటోనీ “ఇంద్రసేన” ట్రైలర్

Vijay Antony new movie Indrasena trailer

Vijay Antony new movie Indrasena trailer

బిచ్చగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోనీ… ఇతను డాక్టర్ సలీం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. బిచ్చగాడు సినిమాతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. బిచ్చగాడు తర్వాత తను చేసిన బేతాళుడు, యమన్ సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి.

ఇప్పుడు విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం “ఇంద్రసేన“.. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ఒక పాత్రలో టీచర్ గా, మరో పాత్రలో తాగుబోతుగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమయ్యాడు విజయ్. ఈ సినిమాలో హీరోగానే కాకుండా, నిర్మాతగానూ, మ్యూజిక్ డైరెక్టర్ గాను, ఎడిటర్ గాను కొనసాగుతున్నాడు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్, ఆర్ స్టూడియోస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విజయ్ ఆంటోనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇంద్రసేన మూవీ ట్రైలర్..త్వరలో విడుదల చేస్తామని చెప్పిన డైరెక్టర్ శ్రీనివాస్, నిర్మాత రాధికాశరత్ కుమార్

ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ఇందులో విజయ్ ఆంటోని మాస్ అవతారంలో కనిపించగా, ట్రైలర్ ప్రేక్షకులకి కనువిందుగా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ నుండి నటుడిగా మారిన విజయ్ ఆంటోని తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో మరోసారి విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

Vijay Antony new movie Indrasena trailer

రాధికా శరత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇది డైరెక్టర్ శ్రీనివాస్ మొదటి సినిమా, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని డైరెక్టర్ తెలిపాడు.

 

Add Comment

Click here to post a comment