ఉయ్యాలవాడ లో ఉపేంద్ర…?

upendra in uyyalawada narasimha reddy

upendra in uyyalawada narasimha reddy: చిరంజీవి నటించనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఆగస్టు 15న లాంచ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకోసం విలక్షణ నటుడు ఉపేంద్రని ఎంపిక చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన ఉపేంద్ర ఈ సినిమాలో ఎటువంటి పాత్రలో నటిస్తున్నాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే యూనిట్ ఉపేంద్రని సంప్రదించారని అంటున్నారు కానీ, ఉపేంద్ర సినిమాలో నటించడానికి అంగీకరించాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.

ఉపేంద్ర కన్నడలో హీరోగా చేస్తూనే ఇటు తెలుగులో కూడా విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఆమధ్య సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కోసం త్రివిక్రమ్ ఉపేంద్రని తీసుకొచ్చారు. ఆ సినిమాలో ఉపేంద్ర అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు చిరు సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు.

READ MORE: ‘పటేల్ సర్’ రివ్యూ మరియు రేటింగ్

Add Comment

Click here to post a comment