తాప్సీకి టాలీవుడ్ నిర్మాతల వార్నింగ్…!

Taapsee Sorry To Raghavendra Rao

Taapsee Sorry To Raghavendra Rao: రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర తీసిన తాప్సీ ఆయనకి అన్‌కండిషనల్‌ అపాలజీ చెప్పేసింది. రెండున్నర నిమిషాల వీడియోలో మొత్తంగా పదిసార్లు సారీ చెప్పి తప్పు చేసానని ఒప్పుకుంది. ఈ విషయం పెద్ద వివాదం అయినప్పుడు సైలెంట్‌గా వున్న తాప్సీ ఆ తర్వాత తన కామెంట్లతో రాఘవేంద్రరావుకే ఇబ్బంది కలగలేదని, ఆయన నవ్వేసారని, అయినా తను జోక్‌ చేసింది తన మీదేనని చెప్పింది.

మొదట తప్పు చేయలేదు అంటూ వాదించిన తాప్సీ సడన్‌గా ఇప్పుడెందుకు సారీ చెప్పినట్టు? దీని వెనుక ‘ఆనందో బ్రహ్మ’ నిర్మాతలు వున్నారని, తన కామెంట్ల వల్ల ఆ సినిమా ఇబ్బందుల్లో పడేలా వుందని, ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేస్తామని అంటున్నారని తాప్సీకి వాళ్లు చెప్పారట.

సారీ చెప్పాలని కోరారట. అయినా కానీ తాప్సీ అంగీకరించలేదట. తన కామెంట్స్‌ వల్ల ఆనందో బ్రహ్మ చిత్రం రిలీజ్‌కి ఏదైనా ఇబ్బంది ఏర్పడినా, ఒకవేళ తన వల్ల ఈ చిత్రాన్ని చూడకూడదంటూ జనం డిసైడ్‌ అయినట్టు తెలిసినా బ్యాలెన్స్‌ రెమ్యూనరేషన్‌ ఇచ్చేది లేదని నిర్మాతలు తెగేసి చెప్పారట.

దాంతో వెంటనే తాప్సీ సారీ చెప్పేసిందట. ఈమధ్య దక్షిణాది చిత్రాలపై అవాకులు చవాకులు పేలుతోన్న తాప్సీ ఈ సంఘటన తర్వాత నోరు అదుపులో వుంచుకుంటుందనే అనుకోవచ్చు.

READ MORE: మీడియా పై మండిపడ్డ పూరీ జగన్నాథ్‌ కూతురు…!

Add Comment

Click here to post a comment