మరోసారి తమ మంచి మనసును చాటుకున్నసోదరులు…!

Suriyas Agaram foundation

Suriyas Agaram foundation: సీనియర్‌ నటుడు శివకుమార్‌ పేరుపై ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్‌ ట్రస్టు 38వ వార్షిక విద్యాసాయం పంపిణీ కార్యక్రమం ఆదివారం నగరంలో జరిగింది. స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌ థియేటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శివకుమార్‌, ఆయన తనయులు, ప్రముఖులు సూర్య, కార్తీ, ట్రస్టు నిర్వాహకులు పాల్గొని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందజేశారు. మొత్తం 22 మంది రూ.10వేలు చొప్పున నగదు అందజేశారు. అలాగే ఈ ఏడాది 500 మంది విద్యార్థులకు ఫీజులు కడుతున్నారు.

ఆ సందర్భంగా సూర్య మాట్లాడుతూ… అగరం ఫౌండేషన్‌ స్థాపించిన తరువాత పాఠశాల, కళాశాల ఫీజులు కట్టలేని స్థితిలో ఎవరూ సంప్రదించినా వారికి తమ వంతు సాయం చేస్తున్నామని, ఈ సేవాదృక్పథం తన తండ్రి నుంచే తమకు అబ్బిందని చెప్పారు. ఆర్థిక కారణాలతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరంగా కాకూడదన్నదే నాన్న ఆశయమని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని సూర్య చెప్పారు. కాగా, ఇదే కార్యక్రమంలో ‘కలాంశాట్‌’ రూపకర్తలైన రిఫత్‌ షారూక్‌ నేతృత్వంలోని స్పేస్‌ కిడ్స్‌ బృందాన్ని శివకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు.

READ MORE: మీడియా పై మండిపడ్డ పూరీ జగన్నాథ్‌ కూతురు…!

Add Comment

Click here to post a comment