స్నేహమేరా జీవితం మూవీ రివ్యూ

Snehamera Jeevitham Movie Review

స్నేహమేరా జీవితం మూవీ రివ్యూ

Snehamera Jeevitham Telugu movie review and rating :

 • విడుదల తేదీ: నవంబర్ 17, 2017
 • స్నేహమేరా జీవితం తెలుగు మూవీ రేటింగ్ : 2.25/5(COULD STILL HAVE BEEN BETTER)
 • దర్శకత్వం : మహేష్ ఉప్పుటూరి
 • నిర్మాత : శివ బాలాజీ మనోహరాన్
 • సంగీతం : సునీల్ కశ్యప్
 • నటీనటులు : శివ బాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ
 • బ్యానర్ : గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్

కథ:

మోహన్ (శివ బాలాజీ) మరియు చలపతి (రాజీవ్ కనకాల) మంచి మిత్రులు. మోహన్ ను చేరదీసి తన మంచి చెడ్డా చూసుకుంటూ ఉంటాడు చలపతి. ఎం.ఎల్.ఏ అవాలనే కోరికతో ఉండే చలపతి మోహన్ పై ఎవరయినా చెయ్యి వేస్తే ఊరుకోడు. ఇందిరా అనే అమ్మాయిని ప్రేమించిన మోహన్ అనుకోని పరిస్థితిలో చలపతిని అపార్థం చేసుకుంటాడు. ఇందిరా, మోహన్ ప్రేమ విజయం సాధించిందా? చలపతి ఎం.ఎల్.ఏ అయ్యాడా? అసలు చలపతి ని మోహన్ ఎందుకు అపార్థం చేసుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే తెరపైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

డైరెక్టర్ మహేష్ ఎంచుకున్న కథ పాతది, దాని తెరమీద చూపించిన విధానం కూడా పాతగానే ఉంది. మోహన్ చలపతి మద్య వచ్చే సన్నివేశాలను ఇంకా బాగా తీసి ఉండవచ్చు. ఈ చిత్రంలో శివ బాలాజీ, రాజివ్ కనకాల చేసిన మోహన్‌, చలపతి పాత్రల్లో పెద్దగా డెప్త్ లేదు. వారి మధ్య స్నేహ బంధాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్‌ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడనే చెప్పాలి. కొన్ని అనుకోని కారణాల వల్ల మోహన్ చలపతిని అనుమానించి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మోహన్ పాత్ర మాతమే కనిపిస్తుంది. చలపతి మనకు కనిపించడు. దీంతో స్నేహితులు ఎప్పుడు కలుస్తారు, ఎలా కలుస్తారు అన్న విషయాలు అర్థం కావు. అసలు చలపతి పాత్ర అంత వరుకేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. చలపతి పాత్రకు కూడా ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేది.
మొదటి సగం సినిమా పాత్రల పరిచయాలకు పరిమితం అవడం తప్ప పెద్దగా కథ అనేది లేదు. రెండో సగంలో ఫ్రెండ్ ను అపార్థం చేసుకున్న సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కథలో మరో ప్రేమ జంటను కలిపేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగున్నా సినిమాకు అవి అవసరం లేదనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ షాట్ బాగానే ఉన్నా ఆ తర్వాత చాలా సేపటి వరకు సినిమా ఆసలి కథలోకి వెళ్ళకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
స్నేహితులు కలిసి ఉండడం, వారిమధ్య విభేదాలు రావడం, విడిపోవడం నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ సన్నివేశాలు డైరెక్టర్ మహేష్ బాగా తీశాడు, కొన్ని సంభాషణలు బాగా రాసుకున్నాడు.శివబాలాజీ తన ప్రేయసిని దక్కించుకోవడం చేసే చిన్న చిన్న పనులు ఆసక్తిగా ఉన్నాయి.ఒక ప్రేమ జంటను కలపడానికి శివ బాలాజీ చేసే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎం.ఎల్.ఎ అవ్వాలనే కోరికతో ఉండే చలపతి పాత్రలో రాజీవ్ కనకాల నటన బాగుంది. సునీల్ కశ్యప్ అందించిన పాటలు గొప్పగా లేనప్పటికీ నేపధ్య సంగీతం బాగుంది. కెమెరామెన్ ధరణి ఎనభైలో జరిగే కథగా సినిమాను అందంగా తీశాడు. మహేంద్ర నాథ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు :

 • శివ బాలాజీ, రాజీవ్ కనకాల యాక్షన్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • ప్రేమ జంటను కలిపే సీన్స్

బలహీనతలు :

 • రొటీన్ స్టోరీ
 • టేకింగ్
 • ఫ్రెండ్స్ మధ్య డెప్త్ లేకపోవడం

రేటింగ్: 2.25/5 (COULD STILL HAVE BEEN BETTER)

Snehamera Jeevitham Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

 

Add Comment

Click here to post a comment