‘అల్లు’వారి పై చెర్రీ కామెంట్స్…!

Ram charan Reply to Pawan Kalyan Fans

Ram charan Reply to Pawan Kalyan Fans: ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం 1985 చిత్రాన్ని చేస్తున్న మెగా పవర్ స్టార్.. సుకుమార్ నిర్మాణంలో రూపొందుతున్న ‘దర్శకుడు’ చిత్ర ప్రమోషన్స్ కోసం ఆడియో లాంఛ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు. ఆ సందర్భంలో ఆడిటోరియంలో పవర్ స్టార్ ను ఉద్దేశించి చెప్పాలంటూ.. బాబాయ్ అనే అరుపులు వినిపించాయి. ‘బాబాయ్.. బాబాయ్. మనకు నచ్చిన వ్యక్తులు గురించి రోజూ మాట్లాడుకోం.. అమ్మ గురించి రోజూ మాట్లాడుకోం.. నచ్చిన వ్యక్తులు మన మనసులో ఉండాలి.. మాటల్లో కాదు.. నా ఫ్యామిలీ నా మనసులో ఎక్కువగా ఉంటుంది.. నా మాటల్లో తక్కువగా ఉంటుంది. అర్ధం చేసుకోండి’ అని అభిమానులను సముదాయించాడు. ఇప్పుడు ఈ కామెంట్లే ‘అల్లు’వారి పాలిట తూటాలు అయిపోయాయ్.

మొన్న వరుణ్ తేజ్.. బాబాయ్ గురించి టాపిక్ వచ్చినప్పుడు.. మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ లేకపోతే నేను లేను అంటూ ఒక్క మాట చెప్పేశాడు. అలాగే అప్పట్లో సాయిధరమ్ తేజ్ కూడా ‘చెబుతాను బ్రదర్’ అంటూ పవన్ ఫ్యాన్స్ ను కూల్ డౌన్ చేశాడు. అదే అల్లు అర్జున్ విషయానికి వస్తే.. డైరక్టుగా ఓపెన్ అయిపోయి.. మీరు అస్తమానం చెప్పమంటే చెప్పను బ్రదర్ అనేశాడు. అతను చెప్పింది నిజమే కావొచ్చు.. కాని ఎమోషనల్ లాజిక్ మిస్సయితే ఎలా? అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడిప్పుడే సద్దుమనిగేట్టు లేదు.

READ MORE: మీడియా పై మండిపడ్డ పూరీ జగన్నాథ్‌ కూతురు…!

Add Comment

Click here to post a comment