నేడే ‘రాజు గారి గది 2’

Raju Gaari Gadhi 2 movie releasing today

Raju Gaari Gadhi 2 movie releasing today

ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న నాగార్జున, అక్కినేని కొత్త కోడలు సమంత అతిథి పాత్రల్లో నటించిన ‘రాజుగారి గది 2’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియమ్ షోలు పడిపోయాయి. బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి ‘రాజుగారి గది’ మూవీతో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ‘రాజుగారి గది 2‘ మూవీని పీవీపీ సంస్థ నిర్మిస్తుంది.

సెన్సార్ బోర్డ్ ఓ కాషన్‌తో యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. 12సంవత్సరాల లోపు పిల్లలు.. తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ సినిమా చూడాలని సెన్సార్ బోర్డ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మద్య చాలా సినిమాలు కామెడీ,హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాగచైతన్యతో వివాహంతో అక్కినేని కోడలుగా మారిన సమంత మామ నాగార్జునతో కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ప్రీమియం షో చూసిన వారు ఈ సినిమా ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, షకలక శంకర్ పై వచ్చే కామెడీ చాలా బాగుందని అంటున్నారు. ఇంట్రవెల్ కి ముందు నాగార్జున మెంటలిస్టు గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా సీరియస్ జోన్ లోకి వెళ్తుందట. ఇంట్రవెల్ తర్వాత సమంత పగ తీర్చుకునే దెయ్యంగా కనిపిస్తుందట.

Raju Gaari Gadhi 2 movie releasing today

ముఖ్యంగా సమంత నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని..పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో సమంత కాస్త భయపెడుతుందని టాక్. ఈ మూవీలో దెయ్యం పాత్రలో పాటు “అమృత” అనే “లా స్టూడెంట్” పాత్రలోనూ సమంత కనిపించనుంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని తెలుస్తుంది. ఇక హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో గ్రాఫిక్స్ బాగా వచ్చాయని, థమన్ మ్యూజిక్ సినిమాకు హైప్ తెచ్చే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది.

అయితే, చైతూ, సమంతల పెళ్లి కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్ కి కాస్త బ్రేక్ పడినట్టయ్యింది. ఈ క్రమంలోనే రిలీజ్ కి ముందు రోజు అంటే నిన్న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించారు. సినిమా నిడివి కేవలం 127 నిమిషాలు మాత్రమే. దీంతో ప్రేక్షకుడు బోర్ గా ఫీలయ్యే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఉండదని ఈ వేడుకలో నాగార్జున తెలిపారు. కాగా ఈ సినిమా హిట్ కావడం మాకు ఎంతో అవసరం అని ఎందుకంటే సమంత మా కోడలుగా అడుగు పెట్టింది.. దాంతో పాటే హిట్ తీసుకు వచ్చిందని కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపించాలని నాగార్జున చెప్పారు.

మొత్తానికి ప్రీమియం షో టాక్ ప్రకారం హర్రర్, కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈమూవీపై పాజిటివ్ టాక్ వస్తుంది. ‘రుద్ర’ అనే మెంటలిస్ట్ పాత్రలో మానసిక నిపుణిడిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడని, దెయ్యంగా పగ తీర్చుకోవాలని భావించే సమంత, దాని అడ్డుకోవడం కోసం ప్రయత్నించే మెంటలిస్ట్‌ పాత్రలో నాగార్జున ఒకరితో మరొకరు పోటీ పడి నటించారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారో అనేది ఇంకాసేపట్లో తెలిసిపోతుంది.

Add Comment

Click here to post a comment