మీడియా పై మండిపడ్డ పూరీ జగన్నాథ్‌ కూతురు…!

Puri Jagannath Daughter Pavithra fires on Media

Puri Jagannath Daughter Pavithra fires on Media: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రస్తుతానికి ఇదంతా టాప్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ చుట్టూనే తిరుగుతోంది. దీని గురించి డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఇప్పటికే స్పందించారు. ప్రస్తుతం తాను ఇప్పటివరకూ దేని గురించి, ఎవరి గురించి మాట్లాడలేదని.. పైసా వసూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని పూరీ ఫేస్‌బుక్‌లో ఓ చిన్న పోస్ట్ పెట్టి ఊరుకున్నాడు. అయితే ఆయన కూతురు పవిత్ర మాత్రం సోషల్‌ మీడియా ద్వారా తన తండ్రిని విమర్శిస్తున్న వారిపై ఫైర్‌ అయింది. ‘నోరు అదుపులో పెట్టుకోండ’ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

‘నోరు అదుపులో పెట్టుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎదుటివారిని విమర్శించకండి. ఏదైనా రాసేముందు ఆలోచించండి. మా డాడీ సెలబ్రిటీ కాబట్టి ఆయన గురించి ఏమి రాసినా ఫర్వాలేదని అనుకోకండి. ఆయన వైపు వేలెత్తి చూపించేముందు ఆయనకు ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. సినీ పరిశ్రమలో ఆయనకు ఓ గుర్తింపు, గౌరవం ఉన్నాయని గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైతే పనీపాటా లేకుండా చెత్త రాస్తున్నారో నేను వారి గురించే మాట్లాడుతున్నాను.

ఒక లక్ష్యం నిర్దేశించుకుని దాని కోసం కష్టపడే వ్యక్తి మా నాన్నా. ఒక దర్శకుడిగా ఆయన పెట్టుబడి ఆయన మెదడే. ఇలాంటి వ్యసనాలతో తన కెరీర్‌ను నాశనం చేసుకోవాలని అయన ఎందుకు అనుకుంటారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఏ సెలబ్రిటీ అయినా పబ్లిక్‌ పర్సనాలిటీ కాదు ఇష్టం వచ్చినట్టు విమర్శించడానికి. మా నాన్నకు డ్రగ్స్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదు. నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి.

READ MORE: ‘పటేల్ సర్’ రివ్యూ మరియు రేటింగ్

Add Comment

Click here to post a comment