ప్రేమతో మీ కార్తీక్ మూవీ రివ్యూ

Prematho Mee Karthik Telugu Movie Review

ప్రేమతో మీ కార్తీక్ మూవీ రివ్యూ

Prematho Mee Karthik Telugu movie review and rating :

 • విడుదల తేదీ: నవంబర్ 17, 2017
 • ప్రేమతో మీ కార్తీక్ తెలుగు మూవీ రేటింగ్ : 3/5(Hit)
 • దర్శకత్వం : రిషి
 • నిర్మాత : రవీందర్ ఆర్.గుమ్మకొండ
 • సంగీతం : షాన్ రహమాన్
 • నటీనటులు : కార్తికేయ, సిమ్రత్ కౌర్
 • బ్యానర్ : రమణ శ్రీ ఆర్ట్స్
 • సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

కథ:

గోపి కృష్ణ(మురళి శర్మ) భారత దేశం నుండి అమెరికా వెళ్లి అక్కడ బిజినెస్ చేస్తున్న బిలియనీర్. అతని కొడుకు కార్తీక్(కార్తికేయ) కూడా చిన్నప్పటి నుండి బిజినెస్ మైండ్ సెట్ తోనే పెరుగుతాడు. ఒక అనుకోని సంఘటన జరిగి గోపి కృష్ణకి తను ఎక్కువ కాలం బ్రతకడు అని తెలుస్తుంది. అప్పుడు అతను తన జీవితంలో ఏమి కోల్పోయాడో తెలుసుకుని ఆ తప్పుని సరిదిద్దుకుందాం అని తన కొడుకుతో తిరిగి భారతదేశానికి తిరిగి వస్తాడు. ఇండియాకి వచ్చాక తండ్రిపై కోపంతో కార్తీక్ తండ్రిని వదిలి వెళ్ళిపోతాడు. అదే సమయంలో కార్తీక్ అనుకోకుండా అంజలి(సిమ్రత్ కౌర్)ని కలుస్తాడు. అసలు ఇంతకీ గోపి కృష్ణ తన జీవితంలో కోల్పోయింది ఏమిటి? కార్తీక్ తండ్రిని వదిలి ఎందుకు వెళ్ళిపోతాడు ? మళ్ళీ ఆ తండ్రి కొడుకులు కలిసిసారా? కార్తీక్ అంజలి ప్రేమించుకుంటారా ? ఇవన్నీ తెలియాలంటే తెరపైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కొత్త డైరెక్టర్ రిషి తన సినిమాకి కథగా ఇంతక ముందు మన ముందుకు వచ్చిన పాత కథనే తీసుకున్నాడు. కానీ దానిని కధనం రూపంలో మార్చుకోవడంలో మాత్రం సఫలం అయ్యాడు అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కొత్తదనంతో డైరెక్టర్ తన కధనాన్ని రాసుకున్నాడు. ముఖ్యంగా అతను ఆ కధనాన్ని మలిచిన విధానం చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకుడిని సినిమా చివరి వరకు తమ సీట్లలో కూర్చోపెట్టడంలో సఫలం అయ్యాడు.

కొత్త హీరో కార్తికేయ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. అతను సినిమా ఆసాంతం తన నటనతో ఆకట్టుకున్నాడు. కొత్త హీరో అయినా అతను ముఖంలో హావభావాలను చాలా చక్కగా పలికించాడు. కొత్త హీరోయిన్ సిమ్రత్ కౌర్ తన అందంతో, తన నటనతో కట్టి పడేసింది. గోపి కృష్ణ పాత్రలో మురళి శర్మ తన గత సినిమాలలానే జీవించేసాడు.

షాన్ రహమాన్ అందించిన సంగీతం చాలా చక్కగా వుంది. సినిమా ఆసాంతం అతను రూపొందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని కట్టేస్తుంది. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాకి ప్రధాన లోపం ఎడిటింగ్ వర్క్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో ఎడిటింగ్ లోపం కనిపిస్తుంది. రమణ శ్రీ ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

బలాలు :

 • కథనంలో కొత్తదనం
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • హీరోయిన్
 • డైరెక్షన్
 • సినిమాటోగ్రఫీ

బలహీనతలు :

 • రొటీన్ స్టోరీ
 • ఎడిటింగ్ వర్క్

రేటింగ్: 3/5 (Hit)

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment