పవర్ స్టార్ కి పోటీ లేదా…?

Pawan Kalyan Is Number One in Telugu Industry: దర్శకుడు రాజమౌళిని మినహాయిస్తే ఇప్పుడు తెలుగు సినిమాకి సంబంధించి ఎవరు నంబర్‌వన్‌ అంటే పవన్‌కళ్యాణ్‌నే చెప్పుకోవాలి. ఏమాత్రం క్రేజ్‌ లేని ఫ్లాప్‌ డైరెక్టర్‌ని పెట్టుకున్నా కానీ అప్పటికి వున్న మాగ్జిమమ్‌ మార్కెట్‌ రేటు పవన్‌ సినిమాకి పలుకుతుంది.

ఇక త్రివిక్రమ్‌లాంటి క్రేజీ డైరెక్టర్‌ జత కలిస్తే దాని రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. మహేష్‌-మురుగదాస్‌ కలిసి భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రం చేసినా, ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తూ ఎంతగా ఆకట్టుకుంటున్నా కానీ పవన్‌-త్రివిక్రమ్‌ చిత్రం బిజినెస్‌తో స్పైడర్‌, జై లవకుశ తూగలేకపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచే పవన్‌ సినిమాకి తొంభై కోట్లకి పైగా బిజినెస్‌ జరిగితే, దాని దగ్గరలోకి కూడా స్పైడర్‌, జైలవకుశ రాలేకపోతున్నాయి. ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడనేది తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రీ రిలీజ్‌ వ్యాపార పరంగా పవన్‌ని కొట్టే హీరో లేడు. తదుపరి చిత్రాలతో అయినా ఎన్టీఆర్‌, మహేష్‌… పవర్‌స్టార్‌కి దగ్గరగా వస్తారేమో చూడాలి.

READ MORE: ‘పటేల్ సర్’ రివ్యూ మరియు రేటింగ్

Add Comment

Click here to post a comment