మరోసారి తండ్రైన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Becomes Dad

Pawan Kalyan Becomes Dad for the second time

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నోవా ఈ రోజు ఉదయం పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది వరకే ఒక పాప ఉండగా, ఇప్పుడు అబ్బాయి జన్మించాడు. దీనితో పవన్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

ఈ రోజు ఉదయమే జన్మించిన తన బాబును ఎత్తుకొని చూస్తున్న పవన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఈ డెలివరీ జరగగా, తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు.

Pawan Kalyan Becomes Dad

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తో విడాకులయ్యాక అన్నా లెజ్‌నోవా అనే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 2011 లో తన ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ అప్పుడు కలిసి, ఆ పై ప్రేమించి వివాహం చేసుకున్నారు.

పవన్ మళ్లీ తండ్రి కాబోతున్నాడంటూ ఆ మధ్య వార్తలు హంగామా చేశాయి కూడా. అక్టోబర్ సెకండ్ వీక్‌లో లెజ్‌నోవా కి డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చినట్టు కూడా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పవన్ మళ్లీ తండ్రైన విషయం తెలుసుకొని సంతోషంలో ఉన్నారు అభిమానులు

Pawan Kalyan Becomes Dad

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో PK25 సినిమాగా ‘అజ్ఞాతవాసి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ తన బాబు తో గడిపిన తర్వాత యధావిధంగా తన సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో జనవరి 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Add Comment

Click here to post a comment