ఆక్సిజన్ తెలుగు మూవీ రివ్యూ

Oxygen movie review in Telugu

ఆక్సిజన్ తెలుగు మూవీ రివ్యూ

  • విడుదల తేదీ: నవంబర్ 30, 2017
  • ఆక్సిజన్ తెలుగు మూవీ రేటింగ్ : 2.75/5(ABOVE AVERAGE)
  • దర్శకత్వం : జ్యోతి కృష్ణ
  • నిర్మాత : ఎస్. ఐశ్వర్య, ఏ. ఎమ్ రత్నం
  • సంగీతం : యువన్ శంకర్ రాజా
  • నటీనటులు : గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమ్మానుయేల్
  • బ్యానర్ : శ్రీ సాయి రామ్ క్రియేషన్స్
  • సినిమాటోగ్రఫీ : చోట కె నాయుడు
  • ఎడిటర్ : ఎస్.బి.యుద్ధవ్

కథ:

రాజమండ్రి దగ్గరలోని ఒక ఊరికి పెద్దగా ఉండే రఘుపతి(జగపతి బాబు)కి అదే ఊరిలో ఉండే ఇంకొక అతనితో శత్రుత్వం ఉంటుంది. అతని అన్నయ్య చావుతో రఘుపతికి ఇంకొక అజ్ఞాత శత్రువు కూడా ఉన్నాడు అని తెలుస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవాలని రఘుపతి, తన కుమార్తె కు అమెరికా సంబంధం చూస్తాడు. అలా కృష్ణప్రసాద్‌(గోపీచంద్‌) శ్రుతి(రాశి కన్నా)ని చూడటానికి అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు. కానీ శృతి మాత్రం ఊరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. ఎలాగైనా ఈ సంబంధం తప్పించాలని మాస్టర్ ప్లాన్ చేస్తుంటుంది. కానీ కృష్ణప్రసాద్‌ మాత్రం ఆ కుటుంబ సబ్యులకు బాగా దగ్గరవుతాడు. ఈ నేపథ్యం లో శత్రువులు వీరి ఫై దాడికి దిగుతారు..ఆ సమయం లో కృష్ణప్రసాద్‌ వారిని ఎలా ఎదురుకున్నాడు? శృతి ని పెళ్లి చేసుకుంటాడా లేదా? అసలు రఘుపతికి మరియు అతని శత్రువులకు శత్రుత్వం ఎలా వచ్చింది? అనేది మాత్రం తెర ఫై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

డైరెక్టర్ ఏ.ఎం.జ్యోతికృష్ణ ఎంచుకున్న కథ మంచిదే అయినా దానిని కధనం రూపంలో మార్చుకునే విషయంలో మాత్రం కొంతమేర విఫలం అయ్యాడు అనే అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు అందులో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇంతక ముందు వచ్చిన సినిమాలలో చుసిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ సినిమాలా తెరకెక్కించినా, సెకండ్ హాఫ్ లో కథను అద్భుతంగా నడిపించి సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడిని బాగా అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ కధనం అంతగా ఆకట్టుకోక పోయిన సెకండ్ హాఫ్ కధనం మాత్రం సినిమాకి ప్రధాన ఆకర్షణ.

యాక్షన్ కథల్లో గోపీచంద్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వచ్చిన ‘శౌర్యం’, ‘లౌక్యం’, ‘జిల్‌’ వంటి యాక్షన్ కథలలో తాను ఎలా నటించాడో ఈ మూవీలో కూడా అదే తరహాలో నటించి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అభిమానులను అలరించాడు గోపీచంద్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో గోపీచంద్ అదరగొట్టాడు. హీరోయిన్స్ విషయానికి వస్తే అను ఇమ్మానుయేల్ జస్ట్ గెస్ట్ రోల్ కే పరిమితం అయ్యింది. ఇక రాశిఖన్నా తన గ్లామర్ తో అలరించింది. కథ పరంగా చూస్తే ఈ ఇద్దరికీ పెద్దగా మార్కులేవి పడలేదు. జగపతి బాబు పంచెకట్టుతో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి అభిమానులను అలరించాడు. వెన్నెల కిషోర్, ఆలీ కామెడీ పర్వాలేదు అనిపించింది. కిక్ శ్యామ్, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి మొదలగు వారు వారి వారి పరిధిలో బాగానే నటించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైట్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది. పీటర్ హైన్స్-స్టoట్స్ సెల్వ ఫైట్స్ మాస్ జనాలను బాగా ఆకట్టుకుంటాయి. కాకపోతే ఫైట్స్ లలో గ్రాఫిక్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు. వెట్రి-ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎస్.బి.యుద్ధవ్ ఎడిటింగ్ చాలా బాగుంది. శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు :

  • గోపీచంద్ యాక్షన్
  • ఇంటర్వెల్ సీన్
  • కామెడీ టైమింగ్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు :

  • ఫస్ట్ హాఫ్
  • ఫైట్స్ లోని గ్రాఫిక్స్
  • కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టు అనిపించడం

రేటింగ్: 2.75/5 (ABOVE AVERAGE)

Hey Pillagada Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment