మరో మల్టీస్టారర్ తో రెడీ అయిన నారా రోహిత్

Nara Rohit Next movie AataGallu

Nara Rohit Next movie AataGallu

బాణం సినిమాతో వెండి తెరకు పరిచయమైన హీరో నారా రోహిత్. సోలో సినిమాతో మంచి సక్సెస్ ని సాధించాడు. ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. నాగ శౌర్యతో కలిసి జో అచ్యుతానంద సినిమాలో నటించి ముల్టీస్టారర్ సినిమాలని మొదలు పెట్టాడు. ఆ తర్వాత శమంతకమణి, కథలో రాజకుమారి వంటి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం ‘బాలకృష్ణుడు‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రోహిత్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాకి రెడీ అయ్యాడు రోహిత్. ఈ సారి నారా రోహిత్- జగపతిబాబు తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ రోజే మొదలైంది, కాగానే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు ఈ చిత్ర బృందం. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఆటగాళ్లు’ అన్న టైటిల్ ని ఖరారు చేశారు. కాగా దీనికి గేమ్ ఫర్ లైఫ్ అన్న ట్యాగ్‌లైన్‌ని పెట్టేశాడు డైరెక్టర్ పరుచూరి మురళి.

ఇక ఈ సినిమా ఓపెనింగ్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరై, క్లాప్ చేశాడు. ఈ సినిమా స్టోరీ వినగానే ఓకే చెప్పానని, ఇద్దరు తెలివైన వాళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో.. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని నారా రోహిత్ తెలిపాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది ఈ చిత్ర బృందం.

Nara Rohit Next movie AataGallu

గతంలో మురళి.. నీ స్నేహం, ఆంధ్రుడు, అధినాయకుడు వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, నారా రోహిత్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేశాడు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి రెండు పోస్టర్లను రిలీజ్ చేశాడు. అవి సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Add Comment

Click here to post a comment