నాని ఓవర్సీస్ రికార్డు…!

Nani Ninnu Kori Overseas Record

Nani Ninnu Kori Overseas Record: వరుసగా నాలుగోసారి మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు నాని. ఈ హీరో నటించిన నిన్నుకోరి సినిమా విడుదలైన వారం రోజుల్లో 10లక్షల డాలర్లు ఆర్జించింది. ఈ సినిమా వసూళ్లతో ఓవర్సీస్ లో కూడా డిపెండబుల్ హీరోగా మారాడు నాని. ఈగ సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు నాని. అయితే ఆ సినిమా టైమ్ కు నానికి అంత క్రేజ్ లేదు.

కేవలం రాజమౌళి మేజిక్ తో ఆ సినిమా ఆడింది. భలేభలే మగాడివోయ్ సినిమా నుంచి నాని రేంజ్ పెరిగింది. ఆ సినిమాతో పాటు నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన నేను లోకల్ మూవీ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఎంసీఏ సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

READ MORE: ‘పటేల్ సర్’ రివ్యూ మరియు రేటింగ్

 

Add Comment

Click here to post a comment