నానితో అఖిల్ హలో సినిమా పోటీపై క్లారిటీ ఇచ్చిన నాగ్

Nagarjuna Clarity on Clash with Nani MCA Movie

నానితో అఖిల్ హలో సినిమా పోటీపై క్లారిటీ ఇచ్చిన నాగ్

నాని నటిస్తున్న ఎంసీఏ, అఖిల్ చేస్తున్న హలో సినిమాలు 24 గంటల తేడాలో థియేటర్లలోకి వస్తున్నాయి. మొన్నటివరకు ఎంసీఏ సినిమాను వాయిదా వేయాల్సిందిగా దిల్ రాజుతో చర్చలు జరిపారు నాగార్జున. కానీ అవేవీ ఫలించలేదు. రెండు సినిమాలు ఒకేసారి వచ్చేస్తున్నాయి. మరి దీనిపై నాగ్ ఏమంటున్నారు..

“మా సినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాం. ఒక ప్లాన్ వేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఎంసీఏ వస్తుందంటున్నారు. నాకు తెలిసి పెద్దగా ఎఫెక్ట్ ఉండదనుకుంటున్నాను. పండక్కి (సంక్రాంతి) 5సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ థియేటర్లు దొరుకుతున్నాయి కదా. సో.. ఈ రెండు సినిమాలకు కూడా బాగానే థియేటర్లు దొరుకుతాయి.” నాని సినిమాతో హలోకు పెద్దగా ప్రాబ్లమ్ ఉండదంటున్నారు నాగ్.

డిసెంబర్ 22 నుంచి ఆల్ మోస్ట్ 8 రోజులు సెలవులు వస్తున్నాయి. రిలీజ్ అప్పుడు 4రోజులు.. జనవరి 1టైమ్ లో మరో 4రోజులు కలిసొస్తున్నాయి. అందుకే 2 సినిమాలు ఒకేసారి వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదనేది నాగ్ వాదన.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ సినిమా హలో. పైగా కీలకమైన వైజాగ్, కృష్ణా ఏరియాల్లో సొంత రిలీజ్ కు వెళ్తున్నారు నాగ్. ఓవైపు నాని రైజింగ్ లో ఉన్నప్పటికీ తమకు టెన్షన్ లేదంటున్నాడు.

Add Comment

Click here to post a comment