మెంటల్ మదిలో మూవీ రివ్యూ

Mental Madhilo Telugu Movie Review

మెంటల్ మదిలో మూవీ రివ్యూ

Mental Madhilo Telugu Movie Review and Rating :

 • విడుదల తేదీ: నవంబర్ 24, 2017
 • మెంటల్ మదిలో తెలుగు మూవీ రేటింగ్ : 2.75/5 (ABOVE AVERAGE)
 • దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
 • నిర్మాత : రాజ్ కందుకూరి
 • సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
 • నటీనటులు : శ్రీ విష్ణు, నివేథా పేతురాజ్
 • బ్యానర్ : ధర్మపత క్రియేషన్స్

కథ:

అరవింద్ కృష్ణ(శ్రీ విష్ణు) తన చిన్నతనం నుండి తన ముందు వున్న ఆప్షన్స్ లో దేనిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియని డైలమాలో పెరుగుతూ ఉంటాడు. అలా ఉన్న అతనికి ఒక చిన్న సంఘటన వల్ల ఆడవాళ్లు అంటే భయం పట్టుకుంటుంది. అలా పెరిగి పెద్దయిన అరవింద్ కి వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. అందరూ అరవింద్ ని రిజెక్ట్ చేస్తున్న టైంలో అరవింద్ ని స్వేచ్ఛ(నివేథా పేతురాజ్) ఓకే చేస్తుంది. అలా వాళ్ళు ప్రేమ లో పడతారు. తర్వాత అరవింద్ ముంబై వెళ్తాడు. అక్కడ అతనికి రేణు(అమృత) పరిచయం అవుతుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగింది? తిరిగి అరవింద్ మరియు స్వేచ్ఛ కలుసుకున్నారా? లేదా? అనేది మనం తెర పైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీసుకున్న కధ పాతదే ఐనా ఆ కధని కధనం రూపంలో మార్చుకునే విషయంలో మాత్రం చాలా నైపుణ్యం చూపించాడు అని చెప్పాలి. హీరో క్యారెక్టర్ కాస్త కొత్తగా చూపించి కథ మొత్తం అతడి ఫై నడిపించిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది..కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. సెకండాఫ్ ను కూడా ఫస్టాఫ్ లాగా తీసుకెళ్తే సినిమా ఇంకో స్థాయిలో ఉండడమే కాదు పెళ్లి చూపులు లెవల్లో సక్సెస్ సాధించేది. హీరో,హీరోయిన్ల క్యారెక్టర్లను బలంగానే రాసుకొని కొంతవరకు సక్సెస్ అయ్యాడు.

శ్రీ విష్ణు ఇప్పటికే గత చిత్రాలతో తన నటన ఎలా ఉంటుందో నిరూపించుకున్నాడు. ఇక ఈ మూవీ లో ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోలేక తికమక పడే కుర్రాడి క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. హీరోయిన్ నివేథా పేతురాజ్ తన మొదటి తెలుగు సినిమాతోనే ప్రేక్షకుల మనసులను తన నటనతో ఆకట్టుకుంది. శ్రీ విష్ణు, నివేథా పేతురాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. వీరిద్దరి రొమాన్స్ కూడా యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. మరో హీరోయిన్ అమృత కాస్త విసిగించింది. తన క్యారెక్టర్ కూడా అలాగే ఉండటం వల్ల మరీ ఓవర్ గా అనిపిస్తుంటుంది. ఫ్రెండ్లీ ఫాదర్ రోల్ లో శివాజీ రాజా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి క్యారెక్టర్ దక్కింది.

సాంకేతిక విభాగానికి వస్తే ముందుగా మనం మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అతను అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. వేదా రమణ్ సినిమా ఫొటోగ్రఫీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. సినిమాలో చాలా క్లోజప్ షాట్స్ పెట్టి ఇబ్బంది పెట్టాడు. ఇక సెకండ్ హాఫ్ లో దాదాపు 30 నిమిషాల వరకు ఎడిటింగ్ కు పని చెప్పాల్సి ఉంది. ధర్మపత క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు పర్వాలేదు. వివేక్ ఆత్రేయ రాసుకున్న డైలాగ్స్ ఈ సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణ. ఓవరాల్ గా ‘‘మెంటల్ మదిలో’’ మాస్ జనాలకు అంతగా నచ్చకపోయినా , క్లాస్ ఆడియన్స్ కు మరియు యూత్ కి మాత్రం నచ్చుతుంది.

బలాలు :

 • ఫస్ట్ హాఫ్
 • ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్
 • శ్రీ విష్ణు, నివేథా పేతురాజ్ ల యాక్షన్

బలహీనతలు :

 • సెకండ్ హాఫ్
 • సినిమాటోగ్రఫీ
 • ఎడిటింగ్

రేటింగ్: 2.75/5 (ABOVE AVERAGE)

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment