లండన్ బాబులు తెలుగు మూవీ రివ్యూ

london babulu telugu movie review in Telugu

లండన్ బాబులు తెలుగు మూవీ రివ్యూ

London Babulu Telugu movie review and rating :

  • విడుదల తేదీ: నవంబర్ 17, 2017
  • లండన్ బాబులు తెలుగు మూవీ రేటింగ్ : 2.5/5 ( Average )
  • దర్శకత్వం : బి. చిన్ని కృష్ణ
  • నిర్మాత : మారుతి
  • సంగీతం : కె
  • నటీనటులు : రక్షిత్, స్వాతి, సత్య
  • బ్యానర్ : మారుతి టాకీస్

కథ:

గాంధీ (రక్షిత్) తనకున్న ఆర్ధిక ఇబ్బందులనుండి బయటపడటానికి, తన స్నేహితుడు పాండు (సత్య) తో కలిసి లండన్ వెళ్ళి డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. వెంటనే తన ఊరిలోని ఒకరి సాయంతో హైదరాబాద్ లో కుమార్ అనే బ్రోకర్ ని కలుస్తారు. వీసా త్వరగా రావడానికి పాసుపోర్టు అప్లికేషన్ లో భార్య పేరు రాయమని బ్రోకర్ చెప్తాడు, దాంతో పెళ్లి కాకపోయినా అప్లికేషన్ లో భార్య పేరు సూర్యకాంతం అని రాస్తాడు. అలా మొదలైన గాంధీ సత్య ల ప్రయత్నం ఎన్ని మలుపులు తిరిగింది ? వారికి వీసా వస్తుందా ? లండన్ వెళ్తారా ? చివరికి ఏమవుతుంది అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

తమిళం లో విజయ్ సేతుపతి నటించిన విజయవంతమైన చిత్రం “ఆండవన్ కట్టళై” అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, పెద్దగా మార్పులు చేర్పులు లేకుండానే తెరకెక్కించారు. తమిళం లో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రానికి, తెలుగులో కామెడీ, సెంటిమెంట్ ఇంకా బాగా పండేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. డైరెక్టర్ చిన్నికృష్ణ సినిమా సెకండ్ హాఫ్ పై తీసుకున్న శ్రద్ధ మొదటి భాగం పై కూడా తీసుకుంటే బాగుండేది. హీరో రక్షిత్ కి ఇది మొదటి సినిమానే అయినా, తన నటనతో మెప్పించాడు. స్వాతి ఈ సినిమాకి పెద్ద బలం. హీరో ఫ్రెండ్ గా నటించిన సత్య తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు, కానీ సరైన డైలాగ్స్ లేకపోవడంతో చాలా సన్నివేశాలలో సత్య కూడా నవ్వించలేకపోయాడు.

సినిమా మొదటి భాగం కధ కధానాలలో లోపం లేనప్పటికీ, సరైన డైలాగ్స్ లేపోవడం, కామెడీ పండకపోవడంతో సినిమా మొదటి భాగం అంత ఆసక్తికరంగా సాగదు. సెకండ్ హాఫ్ లో అయినా తీరు మారుతుందేమో అనుకుంటే, కధనం మళ్ళీ అదే బాట పడుతుంది. కాని సెకండ్ హాఫ్ మొదలయిన ఓ 15 నిమిషాల తర్వాత మాత్రం కధనం ఆసక్తికరంగా మారుతుంది, కామెడీ ఊపందుకుంటుంది. క్లైమాక్స్ లో మంచి మెసేజ్ తో శుభం కార్డు పడుతుంది. ఎప్పుడూ కామెడీ పాత్రలలో నటించిన ధనరాజ్, ఈ సినిమాలో మాత్రం ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించారు.

లాయర్ పాత్రలో కనిపించిన అలీ తన జూనియర్ లాయర్ తో కలిసి పండించిన కామెడీ కొంతవరకు నవ్వులు పూయించింది. దర్శకుడు ఎమోషనల్ సీన్స్ ని పండించడం పై ఇంకా శ్రద్ధ వహిస్తే బాగుండేది. మారుతీ టాకీస్ నిర్మాణ విలువలు ఫరవాలేదనిపించాయి. ఓవరాల్ గా “లండన్ బాబులు” మంచి మెసేజ్ వున్న, మామూలు సినిమా.

బలాలు :

  • కధ
  • స్వాతి, రక్షిత్ ల నటన
  • కామెడీ (సెకండ్ హాఫ్ లో)
  • కధనం

బలహీనతలు :

  • కామెడీ (ఫస్ట్ హాఫ్ లో)
  • పండని భావోద్వేగ సన్నివేశాలు
  • సాదా సీదా సంభాషణలు

రేటింగ్: 2.5/5 (Average)

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment