ఖాకీ తెలుగు మూవీ రివ్యూ

khakee telugu movie review

ఖాకీ తెలుగు మూవీ రివ్యూ

Khakee Telugu movie review and rating :

  • విడుదల తేదీ: నవంబర్ 17, 2017
  • ఖాకీ తెలుగు మూవీ రేటింగ్ : 3/5(Hit)
  • దర్శకత్వం : వినోద్. హెచ్
  • నిర్మాత : ఎస్.అర్ ప్రభు, ఎస్.అర్ ప్రకాష్ బాబు
  • సంగీతం : ఘిబ్రన్
  • నటీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్
  • బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
  • సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
  • ఎడిటర్ : శివానందీశ్వరన్

కథ:

ధీరజ్ హరిప్రసాద్(కార్తీ) డీఎస్పీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తన సొంత ఊరికి తిరిగి వెళ్తాడు. అప్పుడు తన ఎదురింటికి వచ్చిన ప్రియ(రకుల్ ప్రీత్ సింగ్) వాళ్ళ ఫామిలీని చూస్తాడు. ప్రియని చుసిన మొదటి క్షణంలోనే తనతో ప్రేమలో పడతాడు. ఆ విషయం వాళ్ళ ఫామిలీకి తెలిసి వాళ్ళ పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ధీరజ్ కి డీఎస్పీగా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అతను వెళ్లిన ప్రతి చోట నిజాయితీగా ఉండటం వల్ల అతనికి ట్రాన్స్ఫర్లు అవుతూ చివరికి ఒక ఊరు వెళ్తాడు. ఆ ఊర్లో పెండింగ్ లో వున్న ఫైల్స్ అన్నీ చెక్ చేస్తున్నప్పుడు అతనికి ఒక దొంగలముఠా చేస్తున్న దొంగతనాల గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ధీరజ్ ఆ దొంగలముఠాని పట్టుకున్నాడా? లేదా? అసలు ఆ దొంగలముఠా వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు ఇలా దొంగతనాలు చేస్తున్నారు? అనేది మనం వెండి తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

డైరెక్టర్ హెచ్. వినోద్ తీసుకున్న కథ ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడులో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్నారు. ఒక పోలీస్ అనే వాడు తన జీవితంలో తన ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తాడు, అతను తన డ్యూటీని ఎలా నిర్వహిస్తాడు, అనే విషయాన్నీ డైరెక్టర్ వినోద్ చాలా చక్కగా చూపించారు. ఆయన తీసుకున్న కధ మంచిదే అయినా దానికి ఆసక్తికరమైన కధనం రాసుకుని, తెర రూపం కల్పించడంలో కొంత నిరాశ పరిచారు అనే చెప్పాలి. ఎందుకంటే కధనం నెమ్మదిగా సాగడం వల్ల సినిమా చూస్తున్నంత సేపు కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది.

హీరో కార్తీ ఈ సినిమాలో తన నటనతో రెచ్చిపోయారు అనే చెప్పాలి. తన నటనలో ఉన్న ఇంకొక కొత్త కోణాన్ని కార్తీ ఈ సినిమాతో మనకి పరిచయం చేసారు. రకుల్ ప్రీత్ సింగ్ తన క్యారెక్టర్ కి ఉన్నంత స్కోప్ లో చాలా బాగా చేసింది. రకుల్ ఈ సినిమాలో ఇంకొక సారి తన అందచందాలతో ఇంకొక సారి ఆకట్టుకుంది. కార్తీ రకుల్ ల మధ్య నడిచే లవ్ ట్రాక్ అంత ఆసక్తికరంగా లేకపోవడం మరో ప్రధాన లోపం. అభిమన్యు సింగ్ ఆ దొంగలముఠాకి నాయకుడికిగా తన నటనతో ఇంకొక సారి మనల్ని అలరించారు.

ఘిబ్రన్ అందించిన పాటలు పర్వాలేదు అనిపించినా అతను ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంకొక హైలైట్ అని చెప్పాలి. సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరొక ప్రధాన ఆకర్షణ. అతను రాజస్థాన్ నేటివిటీని చాలా బాగా చూపించాడు తన పనితనంతో. శివానందీశ్వరన్ అందించిన ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వాళ్ళ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు :

  • కార్తీ యాక్షన్
  • ఇంటర్వెల్ సీక్వెన్స్
  • ఇంటరాగేషన్ సీన్స్

బలహీనతలు :

  • లవ్ ట్రాక్
  • స్టోరీ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది

రేటింగ్: 3/5 (Hit)

Khakee Review in English

Rating Explanation :

4.0 and Above  CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment