జవాన్ తెలుగు మూవీ రివ్యూ

Jawaan Movie Review in Telugu

జవాన్ తెలుగు మూవీ రివ్యూ

 • విడుదల తేదీ: డిసెంబర్ 1, 2017
 • జవాన్ తెలుగు మూవీ రేటింగ్ : 2.5/5(Average)
 • దర్శకత్వం : బి.వి.ఎస్. రవి
 • నిర్మాత : కృష్ణ
 • సంగీతం : ఎస్.ఎస్. థమన్
 • నటీనటులు : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ పిరజాడ
 • బ్యానర్ : అరుణాచల క్రియేషన్స్
 • సినిమాటోగ్రఫీ : కె.వి.గుహన్
 • ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్

కథ:

జై (సాయిధరమ్ తేజ్) న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం అందుకుంటాడు. చిన్నతనం నుండి RSS లో కార్యకర్త గా ఉండడం వల్ల దేశభక్తి చాలా ఎక్కువ. DRDO లో చేరి మిస్సైల్స్ కనిపెట్టి దేశానికీ సేవ చెయ్యాలనేది అతని ఆశయం. DRDO కనిపెట్టిన ఆక్టోపస్ అనే మిస్సైల్ లాంచర్ ని దోచుకోవాలని కేశవ్ (ప్రసన్న) చేసిన ప్రయత్నాన్ని జై విఫలం చేస్తాడు. దాంతో అతని పై, అతని కుటుంబం పై కేశవ్ పగ పడతాడు. కేశవ్ నుంచి జై ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ? తన ఫ్యామిలీ ని ఎలా కాపాడుకున్నాడు ? ఇంతకీ ఈ కేశవ్ ఎవరు ? కేశవ్ కి జై కి అంతకు ముందే వున్న సంబంధం ఏమిటి ? ఇవన్నీ తెలియాలంటే సినిమా వెండి తెరపై చూడాల్సిందే

ఎలా ఉందంటే:

చాలా సినిమాలకు రైటర్ గా పనిచేసిన బి.వి.ఎస్. రవి డైరెక్టర్ గా చేసిన రెండవ ప్రయత్నమే ఈ ‘జవాన్’. ‘జవాన్’ దేశభక్తి, కుటుంబం అనే అంశాలను తీసుకుని తెరకెక్కించిన థ్రిల్లర్ సినిమా. దేశభక్తి అవసరం ఏమిటి ? కుటుంబమా లేక దేశమా అనే ప్రశ్న వస్తే రెండింటిలో దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి ? ఈమెకి అనే అంశాలను బాగా హైలైట్ చేశారు. ఈ సినిమాకి ప్రధాన బలం సాయిధరమ్ తేజ్, ప్రసన్న ల నటన. ముఖ్యంగా ప్రసన్న స్టైలిష్ క్యారెక్టర్ లో చాలా చక్కగా పరిణితి చెందిన నటనను కనబరిచాడు. మెహ్రీన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది.

కథ, కథానేపథ్యం కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉన్నప్పటికీ కధనం,కథని తెరపై చూపించిన విధానం కొంచెం పాతగా అనిపించాయి. సినిమా మొత్తం దేశభక్తి, కుటుంబం అనే రెండు అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులలో దేశభక్తి ఉప్పొంగేలా చేసే సన్నివేశాలు ఉక్కటి కూడా లేకపోవడం ప్రధాన బలహీనత. దాంతో పాటు అతనికి కుటుంబంతో వున్న అనుభందం ఎంత దృఢమైనదో చూపించే సన్నివేశాలు కూడా అంతగా లేకపోవడం మరో బలహీనత. కానీ సాయిధరమ్ తేజ్ మరియు ప్రసన్న ల స్క్రీన్ ప్రెజన్స్ కొంతవరకు ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేశాయి.

మధ్య మధ్యలో వచ్చే పాటలు కధాగమనానికి అడ్డుతగిలేలా వున్నాయి. అవి సినిమా కి బలం కాకపోగా, ప్రేక్షకులకు విసుగు తెప్పించేలా వున్నాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఆకట్టుకునేలా వున్నాయి. హీరో విలన్ ల మధ్య నడిచే మైండ్ గేమ్ ని ఇంకా ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. సహాయ నటులు వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఎస్.ఎస్. థమన్ అందించిన పాటలు బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడం సినిమాకి మరో ప్రధాన బలహీనత. అనవసరమైన పాటలు, సన్నివేశాలు తొలగిస్తే ఇంకా బాగుండేది. అరుణాచల క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ఫరవాలేదనిపించాయి. ఓవరాల్ గా ‘జవాన్’ ప్రేక్షకులను మెప్పించడంలో పాక్షికంగానే గెలిచాడు.

బలాలు :

 • సాయిధరమ్ తేజ్, ప్రసన్న ల నటన
 • కథ, కథానేపథ్యం
 • కొన్ని మైండ్ గేమ్ సీన్స్

బలహీనతలు :

 • కధనం
 • పాటలు
 • బాక్గ్రౌండ్ మ్యూజిక్
 • ఉద్వేగభరిత సన్నివేశాలు లేకపోవడం

రేటింగ్ 2.5/5(Average)

Read Jawaan Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment