హారర్ మూవీగా “బెలూన్”

Balloon movie

Balloon movie release date

Jai, Anjali Balloon movie teaser by S.S Thaman

బెలూన్ మూవీ.. ఏక కాలంలో తెలుగు మరియు తమిళంలో విడుదలవ్వబోతున్న హారర్ మూవీ. సినీష్ దర్శకత్వంలో దిలీప్, అరుణ్ బాలాజీ, నంద కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అంజలి, జై, జనని అయ్యర్ ప్రధాన పాత్రలను పోషించగా, రాజ్ తరుణ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.

ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఒక్క సారి కాకుండా 5 పోస్టర్లుగా, 5 సెలబ్రిటీస్ చేత విడుదల చేశారు ఈ మూవీ టీం. మొదటి లుక్ ని సందీప్ కిషన్, రెండవ పోస్టర్ ని నిఖిల్, మూడవ పోస్టర్ ని రాజ్ తరుణ్, నాల్గవ పోస్టర్ ని రెజీనా కసిండ్రా, చివరగా ఐదవ పోస్టర్ ని ఈ మూవీ టీజర్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విడుదల చేశారు.

Balloon movie

ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 5 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. త్వరలో యువన్ శంకర్ రాజా సారథ్యంలో నిర్మించిన పాటలను విడుదల చేస్తామని ప్రకటించింది ఈ చిత్ర బృందం. 2016 లో షూటింగ్ ప్రారంభం చేసిన చిత్ర బృందం ఎన్నో హారర్ సన్నివేశాల్ని చిత్రీకరించింది.

Balloon movie

 

ఇదివరకే జర్నీ సినిమాలో జంటగా కనిపించిన అంజలి, జై మరోసారి ఈ సినిమాతో జత కట్టనున్నారు. గీతాంజలి అనే హారర్ సినిమాలో నటించిన అంజలి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కాస్త భయపెట్టింది. ఇక ఇప్పుడు ఈ బెలూన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టడానికి సిద్ధమైంది.

Balloon movie

70mm ఎంటర్టైన్మెంట్, ఫార్మర్స్ మాస్టర్ ప్రొడక్షన్ ఔరా సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాని అక్టోబర్ 28 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు ఈ మూవీ టీం సభ్యులు.

 

Add Comment

Click here to post a comment