ఇంద్రసేన తెలుగు మూవీ రివ్యూ

Indrasena movie review in Telugu

ఇంద్రసేన తెలుగు మూవీ రివ్యూ

 • విడుదల తేదీ: నవంబర్ 30, 2017
 • ఇంద్రసేన తెలుగు మూవీ రేటింగ్ : 2.25/5(COULD STILL HAVE BEEN BETTER)
 • దర్శకత్వం : శ్రీనివాసన్
 • నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ
 • సంగీతం : విజయ్ ఆంటోనీ
 • నటీనటులు : విజయ్ ఆంటోనీ, డయానా చంపిక, మహిమ
 • బ్యానర్ : విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, ఆర్ స్టూడియోస్
 • సినిమాటోగ్రఫీ : కె. దిల్రాజ్
 • ఎడిటర్ : విజయ్ ఆంటోనీ

కథ:

ఇంద్రసేన (విజయ్ ఆంటోనీ-1) రుద్రసేన (విజయ్ ఆంటోనీ-2) ఇద్దరూ కవలలు. పెద్దవాడైన ఇంద్రసేన తాను ప్రేమించిన ఎలిజబెత్ అనే అమ్మాయి చనిపోవడంతో మందు కి బానిస అవుతాడు. తమ్ముడు ఓ స్కూల్ లో PT మాస్టర్ గా పనిచేస్తుంటాడు. వీరి తండ్రి నూజివీడు వ్యాపారస్తుల సంఘానికి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో నాగరాజు అనే వ్యాపారి పగతో రగిలిపోతాడు. అదే సమయంలో స్నేహితుడి చెల్లి పెళ్లి కోసం నాగరాజు దగ్గర ఇంద్రసేన అప్పు చేస్తాడు. ఇంద్రసేన తండ్రి మీద పగతో నాగరాజు ఇంద్రసేనని డబ్బు వెంటనే కావాలని అడుగుతాడు. అప్పుడు ఇంద్రసేన ఏం చేశాడు ? తర్వాత జరిగిన అనుకోని సంఘటనల వల్ల ఇంద్రసేన రుద్రసేన ల జీవితం, వారి మీద ఆధారపడిన వారి జీవితాలు ఎలా మారాయి ? అన్నదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే:

ఓ మధ్య తరగతి కుటుంబం లోని వ్యక్తులకు అనుకోని సంఘటనలు ఎదురయినప్పుడు వారి జీవితాలు ఎలా మారుతాయి అనే కధాంశంతో తెరక్కిన ఈ సినిమాకి విజయ్ ఆంటోనీ నటన ప్రధాన ఆకర్షణ. ద్విపాత్రాభినయం చేసిన విజయ్ ఆంటోనీ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, రెండు పాత్రలకి హావభావాలలో వేరియేషన్ చూపించలేకపోయాడు. సినిమాలోని ఫైట్ సీన్స్ మరో ప్రధాన బలం. విజయ్ ఆంటోనీ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా, బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి మరో ఆకర్షణగా నిలిచింది.

దర్శకుడు శ్రీనివాసన్ తీసుకున్న కథ అంత కొత్తగా ఏమి లేకపోయినా, కొంచెం కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు. కానీ కధనం లోని కొన్ని లోపాల వల్ల కొన్ని సన్నివేశాలు మాత్రమే బాగున్నట్లు అనిపిస్తుంది. సినిమా రెండవ భాగంతో పోలిస్తే మొదటి భాగం కొంతవరకు ఫరవాలేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలలో దర్శకుడు లాజిక్ ని మర్చిపోయినట్లు అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ మరీ నిరుత్సాహ పరిచింది. ఇంద్రసేన క్యారెక్టర్ ని ఇంకా బాగా తీర్చిదిద్దితే బాగుండేది. ఇంద్రసేన పాత్ర కేవలం త్యాగాలు చేయడానికి మాత్రమే ఉన్నట్లు చూపించడం ప్రేక్షకులను విసిగించింది.

హీరోయిన్స్ నటించిన వారి నటన ఫరవాలేదనిపించింది. మిగిలిన సహాయ నటులు వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, ఆర్ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగానే వున్నాయి. ఎడిటింగ్ కి ఇంకా పనిచెప్పి కొన్ని సన్నివేశాలు తొలగిస్తే బాగుండేది. ఓవరాల్ గా విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన “ఇంద్రసేన” ని మరో రొటీన్ చిత్రంగా చెప్పుకోవచ్చు.

 

బలాలు :

 • విజయ్ ఆంటోనీ నటన
 • బాక్గ్రౌండ్ మ్యూజిక్
 • ఫైట్స్

బలహీనతలు :

 • రొటీన్ స్టోరీ
 • స్క్రీన్ ప్లే
 • ఎడిటింగ్
 • సాంగ్స్

రేటింగ్: 2.25/5(COULD STILL HAVE BEEN BETTER)

Click here for Indrasen English Review

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment