హేయ్ పిల్లగాడ మూవీ రివ్యూ

Hey Pillagada Telugu Movie Review

హేయ్ పిల్లగాడ మూవీ రివ్యూ

Hey Pillagada Telugu Movie Review and Rating :

 • విడుదల తేదీ: నవంబర్ 24, 2017
 • హేయ్ పిల్లగాడ తెలుగు మూవీ రేటింగ్ : 2.75/5(ABOVE AVERAGE)
 • దర్శకత్వం : సమీర్ తాహిర్
 • నిర్మాత : డి.వి.కృష్ణ స్వామి
 • సంగీతం : గోపి సుందర్
 • నటీనటులు : దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి
 • బ్యానర్ : లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్

కథ:

చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతంగా కోపం తెచ్చుకునే స్వభావమున్న సిద్దు(దుల్కర్ సల్మాన్), ఏ విషయాన్నైనా కూల్ గా డీల్ చేసే అంజలి(సాయి పల్లవి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. సిద్దు ఎప్పటికైనా మారుతాడని, కోపం తగ్గించుకుంటాడని అంజలి ఎదురుచూస్తుంటుంది. కానీ సిద్దు మాత్రం అలానే ఉంటాడు. ఒకసారి ఇద్దరూ కలిసి వైజాగ్ కు బయలుదేరుతారు. దారి మధ్యలో ఒక డాబా దగ్గర రౌడీలతో సిద్ధుకు గొడవవుతుంది. ఆ గొడవ ఎన్ని విపత్కర పరిస్థితులకు దారితీసింది? దాని వలన సిద్దు, అంజలిలు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నారు? అనేది మనం తెరపైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

డైరెక్టర్ సమీర్ తాహిర్ తన సినిమా కోసం ఒక చిన్న పాయింట్ ని తీసుకుని దానిని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. డైరెక్టర్ తన సినిమాకు ఫస్ట్ హాఫ్ లో కామెడీ ని, సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని జోడించి తన సినిమాను అద్భుతంగా మలిచాడు. దర్శకుడు సమీర్ తాహిర్ తన సినిమాకు కావాల్సినంత నటనను హీరో, హీరోయిన్ల నుండి తీసుకునే విషయంలో చాలా సఫలం అయ్యాడు అనే చెప్పాలి.

సిద్ధార్థ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటన చాలా అద్భుతంగా ఉంది. అతను ఈ సినిమాలో అతని పాత్రకు కావాల్సిన ఎమోషన్స్ ని చాలా బాగా పండించాడు. అంజలి పాత్రలో సాయి పల్లవి చాలా చక్కగా నటించింది. తెరపైన దుల్కర్ సల్మాన్ మరియు సాయి పల్లవి ల మధ్య నడిచే కెమిస్ట్రీ చూడడానికి చాలా చక్కగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీనే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.

గిరీష్ గంగాధరన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఇంకొక ఆకర్షణ. రాత్రివేళల్లో వచ్చే సీన్స్ ని అతను చాలా చక్కగా చూపించారు. నేషనల్ అవార్డు విజేత వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగుంది. సంగత దర్శకుడు గోపి సుందర్ తన పాటలతో నిరాశపరిచాడు, కానీ ఆయన ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.

బలాలు :

 • దుల్కర్ సల్మాన్, సాయి పల్లవిల నటన
 • దర్శకత్వం
 • కధనం
 • సెకండ్-హాఫ్

బలహీనతలు :

 • పాటలు
 • మలయాళం నేటివిటీ

రేటింగ్: 2.75/5 (ABOVE AVERAGE)

Hey Pillagada Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment