ప్రమాదానికి గురైన హీరో రాజశేఖర్

Hero Rajashekar Car Accident

Hero Rajashekar Car Accident in Hyderabad

హీరో రాజశేఖర్ కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని రాశేఖర్ సతీమణి జీవిత తెలిపారు. అయితే, రాజశేఖర్ క్షేమంగా ఉన్నారని, ఆయనకి ఎటువంటి గాయాలు కాలేదు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవిత మీడియాకు తెలియజేశారు.

కొన్ని రోజుల క్రితమే రాజశేఖర్ అమ్మగారు మరణించిన విషయం మీ అందరికి తెలిసిందే.. అప్పటి నుండి ఆయన మనసు ఏం బాగోలేదు. ఆయన తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నారు. ఏదో ఆలోచిస్తూ వాహనాన్ని నడిపినందు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని జీవిత వివరణ ఇచ్చారు. అయితే, పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో తన భర్త మద్యం తాగలేదనే తేలిందని ఆమె మీడియాకి తెలిపారు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ముందువెళ్తున్న రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్‌ కారును రాజశేఖర్‌ కారు వెనుకవైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై రాజశేఖర్ పై రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజశేఖర్ తాగి కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యాడని రామిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.తల్లి చనిపోయిన డిప్రెషన్‌లో రాజశేఖర్‌ కారు నడపడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షల్లో మద్యం సేవించలేదని తేలిందని స్థానిక ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డి సాక్షికి తెలిపారు. చివరకు రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు రాజీ కుదర్చడంతో రామిరెడ్డి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు.

Add Comment

Click here to post a comment