శివగామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Happy Birthday Ramyakrishna

Happy Birthday Ramyakrishna

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రమ్యకృష్ణ గారికి ముందుగా మీ సినీ ఫోకస్ శుబాకాంక్షల్ని తెలియజేస్తుంది.

రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నే కాకుండా హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో నటించి అక్కడి వారి మన్ననలను సైతం పొందింది. ఇప్పటికే 200 కి పైగా సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ.

రమ్యకృష్ణ 1970 సెప్టెంబర్ 15 న తమిళనాడులో జన్మించింది. రమ్యకృష్ణ ఒక మంచి క్లాసికల్ డాన్సర్.. తను ఎన్నో స్టేజి పెర్ఫార్మన్స్ లను చేసింది. 1986 లో మొదటగా భలే మిత్రులు సినిమాలో నటించింది. ఈ సినిమాతో నాగేశ్వరరావు, భాను చందర్ లతో కలిసి సూత్ర దారులు సినిమాలో చేసే అవకాశాన్ని సంపాదించుకుంది.

రమ్యకృష్ణ అలనాటి హీరోలందరితో కలిసి పని చేసింది. సౌందర్య, నగ్మా, మీనా, రోజా వంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఎన్నో సినిమాల్ని చేసింది. అన్నమయ్య సినిమాలో నాగార్జున తో, అల్లరి ప్రియుడు లో రాజశేఖర్ తో, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు మోహన్ బాబుతో కలిసి చేసింది. అంతే కాకుండా సీనియర్ హీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తో కలిసి కూడా ఎన్నో సినిమాల్ని చేసింది.

అంతే కాకుండా యువ హీరోలైన అల్లరి నరేష్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాల్లో కూడా నటించింది. సపోర్టింగ్ నటిగా ఎన్నో అవార్డులను అందుకుంది. ‘కంటే కూతుర్నే కను’ సినిమాకు గాను తన నటనతో నంది అవార్డును దక్కించుకుంది.

2003 లో డైరెక్టర్ కృష్ణవంశీ ని పెళ్లి చేసుకుంది రమ్యకృష్ణ.. వీరిద్దరికి ఒక బాబు ఉన్నాడు. అతని పేరు రిత్విక్. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రమ్యకృష్ణకు సినీ నటీనటులతో పాటు, అభిమానులు ఎంతో మంది సోషల్ మీడియాలో శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు.

ఇక తాజాగా రమ్యకృష్ణ బాహుబలి:1 & 2 సినిమాల్లో, నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాల్లో నటించారు. బాహుబలి సినిమాకు గాను శివగామి పాత్రలో అందరిని ఆకట్టుకున్న రమ్యకృష్ణకు ఉత్తమ నటిగా అవార్డును అందించారు.

రమ్యకృష్ణ ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలనీ, ఎన్నో అవార్డులను అందుకోవాలని కోరుకుంటూ.. మరోసారి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది మీ సినీ ఫోకస్..

Wish You A Very Happy Birthday Ramyakrishna.. Rajamatha  Shivagami

Add Comment

Click here to post a comment