జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Happy Birthday Rajamouli

Happy Birthday Rajamouli

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి గారికి ముందుగా మీ సినీ ఫోకస్.. పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలుపుతుంది.

రాజమౌళి ఇప్పటికీ 12 సినిమాలను డైరెక్ట్ చేశారు. తాను చేసిన అన్నీ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక బాహుబలి సినిమాతో దేశ సినీ చరిత్రను ప్రపంచమంతా చాటి చెప్పిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. 2012 లో వచ్చిన లావణ్య త్రిపాఠీ “అందాల రాక్షసి” సినిమాతో ప్రొడ్యూసర్ గా మారారు.

ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా తన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందామా.. రాజమౌళి 1973 అక్టోబర్ 10 న కర్ణాటక లోని రాయచూర్ లో జన్మించారు. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.. అందుకే మనమందరం ఈ దర్శక ధీరుణ్ణి ఎస్.ఎస్ రాజమౌళి గా పిలుచుకుంటాము. రాజమౌళి కర్ణాటకలో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో పెరిగారు. తన చదువంతా కొవ్వూరులోనే సాగింది. తన చదువు పూర్తయిన తర్వాత.. కే. రాఘవేంద్రరావు గారి సలహాతో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఆ తర్వాత 2001 లో స్టూడెంట్ నెం.1 సినిమాతో వెండి తెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యారు. జూ.ఎన్టీఆర్ తో చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కి మరియు రాజమౌళి కి కూడా మంచి సక్సెస్ ని అందించింది. ఆ సంవత్సరంలోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. తర్వాత కూడా ఎన్టీఆర్ తోనే 2003 లో సింహాద్రి సినిమాను తెరకెక్కించారు.. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత 2004 లో నితిన్-జెనీలియా లతో ‘సై’ సినిమా తీశారు. అలాంటి సినిమా, అలాంటి ఒక రగ్బీ ఆట పైన సినిమా చేసి.. మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి.. ఆ తర్వాత 2005 లో ఛత్రపతి, 2006 లో విక్రమార్కుడు, 2007 లో యమదొంగ, 2009 లో మగధీర, 2010 లో మర్యాద రామన్న, 2011 లో రాజన్న, 2012 లో గ్రాఫిక్ మాయాజాలంతో కూడిన ఈగ లాంటి సినిమాలను చేశారు.

Happy Birthday Rajamouli

ఇక తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకొని 2015 లో బాహుబలి మొదటి భాగాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను తీయడానికి రాజమౌళికి మూడేళ్ళ సమయం పట్టింది. దీన్ని బట్టే ఆ సినిమా కోసం బాహుబలి యూనిట్ ఎంతగా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి రెండవ భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టింది. 2017 ఏప్రిల్ లో ఈ సినిమా థియేటర్లలో ఘనంగా విడుదలైంది.

ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను కురిపించింది. ఇక ఈ సినిమాను మించి మరో సినిమా ఉండదేమో అనేంత రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కింది. భారతీయ సినిమా ఘనతను నలు దిక్కులా వ్యాపించేలా చేసింది. అంతే కాకుండా ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

ఇక రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ గా 3 ఫిలిం ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 2 సిని మా అవార్డులు, ఒక ఐఫా అవార్డు, మరొక సైమా అవార్డు ను అందుకున్నారు.

ఈ రోజు తన పుట్టిన రోజున పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారి వారి శుభాకాంక్షలను తెలియజేశారు. రాజమౌళి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో మంచి సినిమాలను మనకు అందించాలని కోరుకుంటూ.. మరో సారి మీ సినీ ఫోకస్ జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటుంది.

   Wishing You A Very Very Happy Birthday Rajamouli

Add Comment

Click here to post a comment