హ్యాపీ బర్త్ డే నమిత ప్రమోద్

Happy Birthday Namitha Pramod

Happy Birthday Namitha Pramod

ముందుగా సినీ ఫోకస్ నమిత ప్రమోద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది.

తాజాగా కథలో రాజకుమారి చిత్రంలో రాజకుమారిలా కనిపించిన అమ్మాయే ఈ నమిత ప్రమోద్. నాగ శౌర్య, నారా రోహిత్ లతో కలిసి సీత పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది నమిత.

నమిత 1996 సెప్టెంబర్ 19న జన్మించింది. నమిత 7వ తరగతి చదువుకునేటప్పుడే కెమెరా ముందు నటించింది. మళయాలంలో తను చైల్డ్ ఆర్టిస్టుగా నాలుగైదు సీరియల్స్ లో చేసింది. ఇక తర్వాత 2011 లో ట్రాఫిక్ అనే మలయాళ సినిమాలో మొదటిసారి హీరోయిన్ గా నటించింది.

తెలుగులో 2016 లో వచ్చిన చుట్టాలబ్బాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మాయి. తన మొదటి సినిమాను ఆదితో కలిసి చేసే అవకాశాన్ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తన రెండవ సినిమాగా ‘కథలో రాజకుమారి’ సినిమాలో మల్టీ స్టార్రర్ తో కలిసి నటించింది.

కానీ, ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా అనుకున్న విజయాల్ని సాధించలేకపోయాయి.. మరీ, టాలీవుడ్ లో ఈమెకు ఎటువంటి అవకాశాలు వస్తాయో, తన అదృష్టం ఎలా ఉంటుందో చూడాలీ..

మళయాలంలో నమిత దాదాపుగా 20 వరకు సినిమాల్లో నటించింది. మలయాళంలో సినిమాల్లోకి ప్రవేశించిన వెంటనే, ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. తర్వాత కూడా బెస్ట్ స్టార్ పెయిర్ అనే అవార్డును 3 సార్లు గెలుచుకుంది.

ఇలాంటి అవార్డులెన్నో తన సొంతం కావాలని, మరెన్నో హిట్ సినిమాలను నమిత మనకు అందించాలని కోరుకుంటూ.. మరోసారి మీ సినీ ఫోకస్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది..

Wish You A Very Happy Birthday Namitha Pramod

Add Comment

Click here to post a comment