హ్యాపీ బర్త్ డే అలీ

Happy Birthday Ali

Wish You Happy Birthday Ali

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ పుట్టినరోజు నేడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పటికే 1000కి పైగా సినిమాల్లో నటించాడు అలీ. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన అలీ.. ఆ తర్వాత టాలీవుడ్ బెస్ట్ కమెడియన్ గా మారారు. అలీ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. ఈ సందర్భంగా ఆయనకి సినీ ఫోకస్ పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలుపుతుంది.

అలీ 1968, అక్టోబర్ 10 న రాజమండ్రి లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అలీ సోదరుడు ఖయూమ్ కూడా సినిమాల్లో కనిపిస్తున్నాడు. అలీ 1994 లో జుబేదా సుల్తానా బేగం అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇక, బాలనటుడిగా 1979 లో ‘నిండు నూరేళ్లు’ సినిమా ద్వారా బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన అలీ.. దాదాపు అన్నీ పాత్రల్లో మెప్పించారు. బాలనటుడిగానే ఎన్నో సినిమాల్లో కనిపించాడు అలీ. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో గా కూడా చేశారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపై కార్యక్రమాలని చేస్తున్నారు. “అలీతో సరదాగా..” అంటూ ఈ టీవీ లో ప్రసారమయ్యే ఈ షో ద్వారా తనదైన మార్క్ తో ప్రేక్షకులకు సరదాను పంచుతున్నారు. ఎన్నో షోలకి, అవార్డు ఫంక్షన్ లకి యాంకర్ గా వ్యవహరించారు.

అలీ, బెస్ట్ కమెడియన్ గా 2 నంది అవార్డులను, 2 ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నాడు. 2013 లో గ్లోబల్ పీస్ అకాడమీ వారు తమిళనాడులో గౌరవ డాక్టరెట్ ని ప్రదానం చేసింది.

ఈ రోజు అలీ పుట్టిన రోజు సందర్భంగా అలీకి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. యాంకర్ అనసూయ కూడా అలీకి విషెస్ తెలియజేసింది. “నా అభిమాన అలీ గారి పుట్టినరోజులన్నింటిలోకి ఈ బర్త్ డే ఎంతో సంతోషకరంగా ఉండాలి.. ప్రేమతో” అంటూ ట్విట్ చేసింది.

అలీలో ఉన్న మరో మంచిగుణం నలుగురికి సాయం చేయడం. ఎంతో మంది పేదలని ఆర్థికంగా ఆదుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలీ త్వరలోనే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే త్వరలోనే అలీని ఎమ్మెల్యేగా చూడొచ్చు.

ప్రేక్షకుల్ని ఇంతగా అలరిస్తున్న అలీకి మరోసారి మీ సినీ ఫోకస్ నుండి జన్మదిన శుభాకాంక్షలు

Wishing You A Very Very Happy Birthday Ali Garu

Add Comment

Click here to post a comment