అమలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 

Happy Birthday Akkineni Amala

Wish You Happy Birthday Akkineni Amala

సీనియర్ నటి, అక్కినేని నాగార్జున సతీమణి అమలకు ముందుగా మీ సినీ ఫోకస్ నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

అమల.. కింగ్ నాగార్జున భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక హీరోయిన్ గా, జంతు సంరక్షణాధికారిగా, సేవా రంగంలో ముందుండే వ్యక్తిగా ప్రేక్షకుల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు అమల.

అమల ఒక క్లాసికల్ డాన్సర్, తన డాన్స్ చూసిన ఒక తమిళ దర్శకుడు తన సినిమాలో నటించే అవకాశాన్ని ఇప్పించాడు. ఈ విధంగా అమల మొదటి సారి తమిళంలో హీరోయిన్ గా మెరిసింది. ఇక ఆ తర్వాత తమిళంలో ఎన్నో సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో మొదటగా పుష్పక విమానం సినిమాలో నటించిన అమల, కిరాయి రౌడీ, చినబాబు, నిర్ణయం, శివ, మజ్ను, ప్రేమ యుద్ధం వంటి సినిమాల్లో నాగార్జున తో కలిసి నటించింది.

ఆ తర్వాత 1992 లో నాగార్జున, అమలల పెళ్లి జరిగింది. వీరికి 1994లో  అఖిల్ జన్మించాడు. ఇక సినిమాలకు దూరమైన అమల సేవా రంగాల్లో చురుగ్గా ఉంటూ.. ఎన్నో సేవలను చేసింది. అమల జంతు ప్రేమికురాలు. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే సంస్థ ద్వారా జంతువులకు సంరక్షణను కలిపిస్తూ తన వంతూ కృషి చేస్తున్నారు.

ఇక తన భార్యకు నాగార్జున శుబాకాంక్షల్ని తెలుపుతూ, ‘ ఐ లవ్ యు స్వీట్ హార్ట్, నీతో కలిసి ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని నాకు నేనే కోరుకుంటున్నానంటూ’ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Happy Birthday Akkineni Amala

2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు అమల. ఆ తర్వాత అక్కినేని కుటుంబం కలిసి నటించిన మనం సినిమాలోనూ కనిపించారు అమల. అమల కు ఉత్తమ నటిగా రెండు “ఫిలిం ఫేర్” అవార్డులు, ఒక “సినీ మా”  అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆశిస్తూ.. అమల కు మరో సారి పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది మీ సినీ ఫోకస్.

A Very Happy Birthday Akkineni Amala

Add Comment

Click here to post a comment