గృహం మూవీ రివ్యూ

Gruham Telugu Movie Review

గృహం మూవీ రివ్యూ

Gruham Telugu movie review and rating :

  • విడుదల తేదీ: నవంబర్ 17, 2017
  • గృహం తెలుగు మూవీ రేటింగ్ : 2.75/5 ABOVE AVERAGE (Worth Your Money)
  • దర్శకత్వం : మిలింద్ రావ్
  • నిర్మాత : సిద్ధార్థ్
  • సంగీతం : గిరీష్
  • నటీనటులు : సిద్ధార్థ్, ఆండ్రియా జెరేమియహ్
  • బ్యానర్ : వియాకం 18 మోషన్ పిక్చర్స్
  • సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
  • ఎడిటర్ : లారెన్స్ కిషోర్

కథ:

డాక్టర్ క్రిష్ (సిద్దార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా) తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో ఆనందకరమైన జీవితం గడుపుతుంటాడు. అలా ఆనందంగా గడుపుతున్న వాళ్ళ జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి కారణం వాళ్ళ పక్కింట్లోకి వచ్చిన ఒక ఫ్యామిలీ. వాళ్ళు పక్కింట్లోకి వచ్చిన రోజునుండే ఆ ఇంట్లో విచిత్రకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లోని అమ్మాయి జెన్నీ (అనీషా ఏంజెలిన)ని ఒక దెయ్యం ఆవహిస్తుంది. ఏమిటా సంఘటనలు ? ఆ దెయ్యం ఎవరు ? దాని కథేమిటి ? అది జెన్నీనే ఎందుకు ఆవహించింది ? దాని బారి నుండి ఆ కుటుంబం ఎలా బయటపడింది ? అనేదే ఈ సినిమా.

ఎలా ఉందంటే:

చాలా కాలం తర్వాత తెలుగులో ఒక ఫుల్ లెంగ్త్ హార్రర్ కామెడీ “గృహం” రూపంలో వచ్చింది. కధలో కొత్తదనం లేకపోయినా, సినిమాలోని ప్రధాన బలం అనవసరమైన సన్నివేశాలు లేకుండా హర్రర్ సీన్స్ పై ఫోకస్ పెట్టడమే. భయపెట్టే సన్నివేశాలకు తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో హార్రర్ సన్నివేశాలు రక్తి కట్టాయి. దర్శకుడు కామెడీ, లవ్ ట్రాక్స్ లాంటివి పక్కన పెట్టి పూర్తిస్థాయి హార్రర్ పై దృష్టి పెట్టడంతో సినిమా నడుస్తున్నంతసేపు హర్రర్ మూడ్ క్యారీ అయింది. సిధార్ధ తన నటనతో ఆకట్టుకున్నాడు, ఆండ్రియా తన పాత్రకు న్యాయం చేసింది. జెన్నీ పాత్రలో నటించిన అనీషా ఏంజెలిన తనకు దెయ్యం ఆవహించే సన్నివేశాలలో అద్భుతంగా నటించింది.

ఒక ఇంట్లో చనిపోయినవారు ఆత్మగా మారి, ఆ ఇంట్లో వుండే వారిపై పగ సాధించడం అనే కధాంశం చాలా సినిమాలలో చూసినదే. కానీ దర్శకుడు సన్నివేశాలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంది, కొన్ని సన్నివేశాలలో భయపెట్టే విధంగా వుంది. కధాంశం అర్ధమవడంతో తర్వాత వచ్చే సన్నివేశాలను సులభంగా వూహించేవిధంగా ఉండడంతో ప్రేక్షకులు హార్రర్ సన్నివేశాలలోని థ్రిల్ మిస్సయ్యారు. దానికి తోడు సినిమాలోని ప్రధాన పాత్రలు, జెన్నీ కి దెయ్యం ఆవహించింది అనే విషయాన్ని సెకండ్ హాఫ్ చివరి వరకు అర్ధంచేసుకోక పోవడం అసహనానికి గురిచేసింది. ఫస్టాఫ్ అంతా హర్రర్ మూమెంట్స్ తో నడిపి ఇంటర్వెల్ సమయంలో భయానకమైన సన్నివేశంతో మెప్పించిన దర్శకుడు క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ తో పాటు హర్రర్ సీక్వెన్స్ ను పెట్టి ఆకట్టుకున్నాడు.

గిరీష్.జి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. హర్రర్ సన్నివేశాల్లో మంచి ప్రభావం చూపింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హర్రర్ సినిమాకు కావల్సిన హర్రర్ మూడ్ ను సినిమా మొత్తం క్యారీ చేసేలా కెమెరా వర్క్ చేశారాయన. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.సిద్దార్థ్ నటించిన ఈ ‘గృహం’ సినిమా చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి హర్రర్ సినిమాను చూసిన అనుభూతిని కలిగించింది, కానీ కధ, పాత్రల స్వభావంలో కొత్తదనం ఉంటే బాగుండేది.

బలాలు :

  • భయపెట్టే సన్నివేశాలు
  • డైరెక్షన్
  • మేకింగ్ వాల్యూస్
  • ఎడిటింగ్
  • సినిమాటోగ్రఫీ

బలహీనతలు :

  • పాత కధ
  • కొన్ని పాత్రల స్వభావం
  • థ్రిల్లింగ్ సీన్స్ లేకపోవడం

రేటింగ్ 2.75/5 ABOVE AVERAGE (Worth Your Money)

Rating Explanation :

4.0 and Above  CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment