జెమినీ లో “ఫిదా” షో

Fidaa show host HariTeja

Fidaa show host HariTeja

హరితేజ.. బుల్లితెర లోని సీరియల్స్ ద్వారా పరిచయమైన అమ్మాయి.. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రతిభను చాటుకుంది. ఈ టీవీ లో వచ్చే అభిరుచి కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఆ తర్వాత వెండి తెర పైన కూడా మెరిసింది. అందరి బంధువయా, అనగనగా ఓ ధీరుడు, దమ్ము, దిక్కులు చూడకు రామయ్య, 1 నేనొక్కడినే, అత్తారింటికి దారేది, విన్నర్, దువ్వాడ జగన్నాథం, అ ఆ, ఉంగరాల రాంబాబు వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ ని పోషించింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాలో మంగమ్మ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైంది హరితేజ. రీసెంట్ గా బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఇంటి సభ్యురాలిగా ఉండి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 1 లో తానే విజేతగా నిలుస్తుందని, ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ, శివ బాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా నిలవగా, హరి తేజ మూడో విజేతగా నిలిచింది.

ప్రస్తుతం హరితేజ జెమిని ఛానెల్ లో ప్రసారమవ్వబోయే ఒక షోలో హోస్ట్ గా చేయనుంది. “ఫిదా” అనే ఈ షో త్వరలో జెమిని లో ప్రసారమవ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ హోస్ట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ ఈ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం జెమినిలో ప్రసారమవ్వబోయే ఫిదా షో కి యాంకర్ గా వ్యవహరించనుంది.

ఈ ఫిదా షో ఎప్పటి నుండి ప్రసారమవుతుందో, ఎన్ని గంటలకు ప్రసారమవుతుందో అన్న విషయాన్నీ ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఈ ప్రోమో ద్వారా.. ఈ షో కాస్త రానా హోస్ట్ చేసిన నెం.1 యారి విత్ రానా షో మాదిరి ఉండేట్టుగా అనిపిస్తుంది. వారానికి ఒక రోజో, రెండు రోజులో ప్రసారమయ్యే ఈ షోలో సినీ నటీనటుల విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తుంది హరితేజ.

అతిథిలా ఈ షోకి ఎవరైనా వస్తారా? అసలు ఈ ఫిదా షో ఏంటి? అనే విషయం గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.. మరీ.. హరితేజ ఏ విధంగా మనకు మన స్టార్ హీరోల, హీరోయిన్ల విషయాలను తెలియజేస్తుంది.. హోస్ట్ గా హరితేజ ప్రేక్షకులను ఎంతవరకు అలరించనుందో తెలుసుకోవాలంటే.. మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..

Fidaa show host HariTeja

Add Comment

Click here to post a comment