కేర్ అఫ్ సూర్య మూవీ రివ్యూ

care of surya telugu review

కేర్ అఫ్ సూర్య మూవీ రివ్యూ

C/o of Surya movie review and rating :

  • విడుదల తేదీ: నవంబర్ 10, 2017
  • కేర్ అఫ్ సూర్య మూవీ రేటింగ్ : 2.5/5 (AVERAGE)
  • దర్శకత్వం : సుశీంధిరన్
  • నిర్మాత : చక్రి చిగురుపాటి
  • సంగీతం : డి. ఇమ్మన్
  • నటీనటులు : సందీప్ కిషన్, మెహ్రీన్ పిర్జాద
  • బ్యానర్ : లక్ష్మీ నరసింహా ఎంటర్టైన్మెంట్స్
  • సినిమాటోగ్రఫీ : లక్ష్మణ్ కుమార్

కథ:

సూర్య (సందీప్ కిషన్) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, MBA లో మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవడం వల్ల ఫ్రెండ్స్ తో కలిసి ఓ కేటరింగ్ బాయ్ గా పనిచేస్తుంటాడు. సూర్య ఫ్రెండ్ మహేష్ అంటే సూర్య కి చాలా ఇష్టం కానీ సూర్య వాళ్ళ అమ్మకి మాత్రం ఇష్టం ఉండదు. ఇలా గడిచిపోతున్న సూర్య జీవితం లోకి సాంబశివుడు అనే కాంట్రాక్ట్ కిల్లర్ ప్రవేశిస్తాడు. ఆతర్వాత సూర్య జీవితం అంతా తల్లకిందులు అవుతుంది. అలాంటి సంఘటన నుండి సూర్య తన ఫ్రెండ్ ని ఫ్యామిలీ ని ఎలా రక్షించుకుంటాడు అన్నదే మిగిలిన కధ. ఇంతకీ సూర్య జీవితాన్ని ప్రభావితం చేసే ఆ సంఘటన ఏమిటి ? ఈ సాంబశివుడు సూర్య జీవితంలోకి ఎలా ఎందుకు ప్రవేశిస్తాడు ? సాంబశివుడు మహేష్ ని ఎందుకు చంపాలనుకుంటాడు ? ఇవన్నీ తెలియాలంటే సినిమా వెండి తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

డైరెక్టర్ సుశీందిరన్ తమిళం లో మంచి పేరున్న దర్శకుడు, అయన దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు శివ’, ‘పల్నాడు’ లాంటి సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పరిశీలిస్తే అన్నీ చాలా సహజంగా, రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి, హీరోని చాలా సాధారణ వ్యక్తిలా చూపించడం సుశీందిరన్ నైజం. ఈ సినిమా కూడా అయన శైలి కి తగ్గట్లే చాలా సహజంగా, రియాలిటీకి దగ్గరగా వుంది. సుందీప్ కిషన్ కూడా సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో చాలా చక్కగా ఇమిడి పోయాడు. సుందీప్ స్నేహితుడి పాత్రలో నటించిన విక్రాంత్ సేతు నటన బాగుంది.

విల్లన్ పాత్రలో నటించిన హరీష్ ఉత్తమన్ నటన, డి. ఇమ్మన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ లు సినిమాకి పెద్ద బలాలు. డైరెక్టర్ సుశీందిరన్ తీసుకున్న స్టోరీ, దాన్ని తెరకెక్కించిన విధానం ఆయన పాత సినిమాలను (‘నా పేరు శివ’, ‘పల్నాడు’) గుర్తు చేస్తుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్, ఇవ్వాలనుకున్న మెసేజ్ మంచిదే అయినా దాన్ని వినోదభరితంగా తెరకెక్కించిడంలో విఫలమయ్యారు. సూర్య మహేష్ ల మధ్య స్నేహాన్ని, సూర్య కి తన కుటుంబంతో వుండే అనుబంధాన్ని గుండెకి హత్తుకునేలా తెరకెక్కించలేకపోయారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ ల ప్రేమకి మాత్రమే వాడుకున్నారు, అవికూడా అంత వినోదభరితంగా అనిపించకపోవడంతో ఫస్ట్ హాఫ్ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో సినిమా ఊపందుకుంటుంది, సినిమా ఇంటరెస్టింగ్ గా సాగుతోంది అనుకునేలోపు అనవసర సన్నివేశాలతో సినిమా మళ్ళీ స్లో అవుతుంది. క్లైమాక్స్ ‘పల్నాడు’ సినిమాని గుర్తు చేస్తుంది.

నటనకి అంతగా స్కోప్ లేని పాత్రలో మెహ్రీన్ ఫరవాలేదనిపించింది. లక్ష్మీ నరసింహా ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. డి. ఇమ్మన్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. మొత్తంమీద ‘కేర్ అఫ్ సూర్య’ అంతగా ఆకట్టుకోని రెగ్యులర్ సినిమా అని చెప్పుకోవచ్చు.

బలాలు :

  • సందీప్ నటన
  • సెకండ్ హాఫ్
  • బాక్గ్రౌండ్ మ్యూజిక్
  • హరీష్ ఉత్తమన్, విక్రాంత్ సేతు ల నటన

బలహీనతలు :

  • నెమ్మదించిన కధనం
  • పాటలు
  • స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.5/5 (AVERAGE)

C/o Surya Movie Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment