బాలకృష్ణుడు మూవీ రివ్యూ

Balakrishnudu Telugu Movie Review

బాలకృష్ణుడు మూవీ రివ్యూ

Balakrishnudu Telugu Movie Review and Rating :

 • విడుదల తేదీ: నవంబర్ 24, 2017
 • బాలకృష్ణుడు తెలుగు మూవీ రేటింగ్ : 2.25/5 (COULD STILL HAVE BEEN BETTER)
 • దర్శకత్వం : పవన్ మల్లెల
 • నిర్మాత : బి.మహేంద్ర బాబు
 • సంగీతం : మణి శర్మ
 • నటీనటులు : నారా రోహిత్, రెజీనా కాసాండ్రా
 • బ్యానర్ : మాయాబజార్ మూవీస్

కథ:

రవీందర్ రెడ్డి (ఆదిత్య) కర్నూలు లోని ఉయ్యాలవాడ చుట్టూ వున్న 40 గ్రామాలకి పెద్ద. తనకున్న 2000 ఎకరాలలో స్కూల్స్ , హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు కట్టి సీమ ప్రజలకి అండగా నిలవాలనుకుంటాడు. తన అన్న ఆశయానికి భానుమతి దేవి (రమ్యకృష్ణ) అండగా నిలబడుతుంది. ఇది నచ్చని పసిరెడ్డి, రవీందర్ రెడ్డి ని కలిసి తనతో చేతులు కలపమని హెచ్చరిస్తాడు, దాంతో రవీందర్ రెడ్డి పసిరెడ్డి ని కొడతాడు. అవమానం తట్టుకోలేని పసిరెడ్డి ఉరేసుకుని చనిపోతాడు. పగతో రగిలిపోయిన పసిరెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి (అజయ్) రవీందర్ రెడ్డి పై ఎలా పగ తీర్చుకుంటాడు ? ఆ తర్వాత భానుమతి దేవి ఏం చేస్తుంది ? ప్రతాప్ రెడ్డి నుండి తన మేనకోడలు ఆధ్య (రెజినా కసాండ్రా) ని బాలు (నారా రోహిత్) సాయంతో ఎలా కాపాడుకుంటుంది ? అన్నదే మిగిలిన కధ.

ఎలా ఉందంటే:

దర్శకుడు పవన్ మల్లెల తీసుకున్న కథ చాలా పాతగా, 4 – 5 సంవత్సరాల క్రితం తయారు చేసుకున్న కథలా అనిపించింది. ఒకవేళ ఈ సినిమా 4 – 5 సంవత్సరాల క్రితం వస్తే ఫలితం బాగుండేదేమో కానీ తెలుగు ప్రేక్షకులు కొత్త కధలను కోరుకుంటున్న ఈ టైంలో ఇలాంటి కథతో రావడం మాత్రం తప్పటడుగే. హీరోయిన్ ని కాపాడే హీరో, ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యాక్షన్ గొడవలు, మధ్య మధ్యలో వచ్చే రొటీన్ కామెడీ సీన్స్, అవసరం లేకపోయినా మేమున్నాం వచ్చి అంటూ వచ్చే పాటలు …. ఇలాంటి పరమ రొటీన్ కధలు చూసి చూసి తెలుగు ప్రేక్షకులు విసిగిపోయారు. తీసుకున్న కథ మాత్రమే కాదు, దర్శకుడు కథని నడిపించిన తీరుకూడా పాతగానే వుంది.

ప్రేక్షకులని ఆనందంతో గాని, బాధతో గాని, థ్రిల్ తో గాని ఉద్వేగపరిచే సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాలో మరో ప్రధాన లోపం. దర్శకుడు ఎంచుకున్న కథానేపథ్యం చాలా సీరియస్ గా ఉంటుంది, కానీ సినిమా మొదలై అసలు కథలోకి వెళ్లే సరికి దర్శకుడు మిగిలిన కథని అంతా కామెడీ తో నడిపించడానికి ప్రయత్నించాడు. దాంతో ప్రేక్షకులకి అసలు ఏం జరుగుతోందో, కథనం ఎక్కడకి వెళ్తోందో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. డైలాగ్స్, డైరెక్షన్ సరిగా లేకపోవడంతో సన్నివేశాలు సరిగా పండలేదు. కామెడీ ట్రాక్ రొటీన్ గా ఉండడంతో చిరాకొస్తుంది. పాటలు, సినిమాటోగ్రఫీ, బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి అండగా నిలబడలేకపోయాయి.

ప్రధాన తారాగణం అనుభవం వున్న వారు కావడంతో కొంతలో కొంత వారి నటన ఊరటనిచ్చింది. నారా రోహిత్ అన్ని సినిమాలలో మాదిరిగానే ఈ సినెమాలో కూడా నటించాడు. ఓవరాల్ గా “బాలకృష్ణుడు” రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే పరమ రొటీన్ సినిమా.

బలాలు :

 • ప్రధాన తారాగణం నటన

బలహీనతలు :

 • రొటీన్ స్టోరీ
 • స్క్రీన్ ప్లే
 • డైరెక్షన్
 • సాంగ్స్
 • ఎడిటింగ్

రేటింగ్ 2.25/5 (COULD STILL HAVE BEEN BETTER)

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment