బాలకృష్ణ 102 మూవీ టైటిల్

Balakrishna next movie

Balakrishna next movie 

Balakrishna next movie titled as “Karna”

నటసామ్రాట్ బాలకృష్ణ మాములు స్పీడ్ గా లేడు..వయస్సు తో సంబంధం లేకుండా యువ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా పూర్తి అవ్వకముందే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. అభిమానుల్లో సంబరాలు నింపుతున్నాడు. ఇటీవలే తన 101 వ సినిమాగా పైసా వసూల్ మూవీతో హిట్ కొట్టిన బాలయ్య , ప్రస్తుతం తన 102వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం తాలూకు రెండు షెడ్యూళ్లు పూర్తి చేసింది. పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఫై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కర్ణ‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రస్తావనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఫిలిం సర్కిల్లో మాత్రం ఈ టైటిల్ బాగా చక్కర్లు కొడుతుంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయకిగా నటిస్తుండగా మలయాళ హీరోయిన్ నటాషా దోషి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతి బరిలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తమిళనాడు కుంభకోణంలో ఇటీవల మేజర్ షెడ్యూల్ జరగ్గా.. ఇపుడు హైదరాబాద్‌లో క్లైమాక్స్ సీన్స్ షూట్‌ చేస్తున్నారట.ఈ ప్రాజెక్టుకి ‘కర్ణ’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని, అంతకు ముందు జయసింహ, రెడ్డిగారు లాంటి టైటిల్స్ అనుకున్నా స్టోరీకి తగ్గట్టుగా కర్ణ అయితే బాగుంటుందని యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్‌కు ఆకట్టుకునేలా స్టోరీ వుంటుందని యూనిట్ టాక్. నయనతార, నటాషా లతో పాటు ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Add Comment

Click here to post a comment