పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్న ‘బిగ్ బి’

Amitabh Bachchan not celebrating his 75th Birthday

Amitabh Bachchan not celebrating his 75th Birthday

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈసారి బర్త్ డే వేడుకలు జరుపుకోవడం లేదని, అలాగే దీపావళి పండుగకు కూడా దూరంగా ఉండనున్నారని అభిమానులకు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బిగ్ బి బర్త్ డే అనగానే ఎంతో మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయడానికి ఆయన ఇంటికి క్యూ కడుతారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తారు.

బిగ్ బి..బాలీవుడ్ లో యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఈనెల 11వ తేదీన ఆయన పుట్టిన రోజు. 75వ వసంతం లోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ఆయన ఇంటిలో పండగ సందడి వాతావరణం నెలకొంటుంది. వేలాదిగా విచ్చేసిన అభిమానులు ఆయనకు శుభాకాంక్షల్ని తెలియజేస్తారు.

కానీ ఈసారి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేశారు. “ఈ సారి బర్త్ డేతో పాటు దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నా. ఆ టైంలో నేను ముంబైలో కూడా ఉండకపోవచ్చు” అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు.

ఈ విషయాన్నీ తెలుసుకున్న బిగ్ బి అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఇందుకు గల కారణాలేంటి అనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో అమితాబ్ బచ్చన్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 30 మిలియన్లకు చేరుకుంది. దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా సంతోషంతో బిగ్ బి కి అభినందనలను తెలిపారు.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘అమీర్ ఖాన్’ హీరోగా నటిస్తున్నారు. ఇక ఆ సినిమా తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా నటించనున్నారని సమాచారం. వీటితో పాటు టాలీవుడ్ లో చిరంజీవిసైరా నరసింహారెడ్డి‘ సినిమాలో కూడా అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Add Comment

Click here to post a comment