11న అజ్ఞాతవాసి సర్ప్రయిజ్?

Agnathavaasi Surprise on December 11th

11న అజ్ఞాతవాసి సర్ప్రయిజ్?

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల పది తరువాత అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ జరగాల్సివుంది. కానీ తెలుగు మహాసభలు ఈ నెల 5నుంచి 19వరకు జరుగుతున్నందున మరే భారీ ఫంక్షన్ కు అనుమతి ఇచ్చేది లేదని పోలీస్ వర్గాలు తెగేసి చెప్పాయి. దీంతో సభను 20లేదా 21కి వాయిదా వేసుకోక తప్పలేదు. హైదరాబాద్ కాకుండా మరో చోట చేయాలన్న ఉద్దేశం పవన్ కు, త్రివిక్రమ్ కు లేదు.

అయితే ఈ లోగా సినిమాకు మరింత బజ్ తెచ్చే కార్యక్రమాలు స్టార్ట్ చేసారు. ఆడియో పంక్షన్ లోనే అన్ని పాటలు వదలాలి అనుకున్నారు. ఒక్కటి మాత్రమే సంగీత దర్శకుడు అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా వదిలారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని మరో సింగిల్ వదలబోతున్నారు. మరో సింగిల్ ఎప్పుడు వదలబోతున్నదీ రేపు చెబుతా అంటూ అనిరుధ్ ట్వీట్ చేసాడు. ఆ డేట్ ఈ నెల 11అని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

అంటే 11న మరో సింగిల్ బయటకు వస్తుందన్నమాట. దాంతో పాటే పవన్ ఫ్యాన్స్ కోసం ఇంకో సర్ప్రయిజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటీ అన్నది బయటకు రాలేదు కానీ, ఓ చిన్న విడియో సర్ప్రయిజ్ వుండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో పవన్ స్టెప్ ఊకటి మెరుపులా ఒకటి వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

Add Comment

Click here to post a comment