అదిరింది తెలుగు మూవీ రివ్యూ

Adhirindi telugu review

Adhirindi movie review in Telugu

Adhirindi movie review and rating :

  • విడుదల తేదీ: అక్టోబర్ 27, 2017
  • అదిరింది మూవీ రేటింగ్ : 3/5
  • దర్శకత్వం : అట్లీ
  • నిర్మాతఎన్. రామసామి, హేమ రుక్మని, ఆర్. మహేంద్రన్, హెచ్. మురళి
  • సంగీతం : ఎ.ఆర్ రెహమాన్
  • నటీనటులు : విజయ్, సమంత, నిత్య మీనన్, ఎస్.జే సూర్య, కాజల్ అగర్వాల్
  • బ్యానర్ : తేనాండాళ్ స్టూడియో లిమిటెడ్
  • సినిమాటోగ్రఫీజి.కె విష్ణు
  • ఎడిటర్ : రూబెన్

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన “అదిరింది” చిత్రం ఎట్టకేలకు విడుదలయింది. ఇది తమిళ చిత్రం మెర్సల్ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఈ చిత్రం లో విజయ్ త్రిపాత్రాభినయం చేయడం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్ లో దీపావళి కి రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం తెలుగు లో కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో మన రివ్యూలో చూద్దాం.

కథ:

వరుస కిడ్నప్ ల నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ అయిన సత్యరాజ్ విజయ్ ని అరెస్ట్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విజయ్ ఒక డాక్టర్, అందరూ 5 రూపాయల డాక్టర్ అని పిలుస్తుంటారు, ఎందుకంటె తన క్లినిక్ వచ్చే పేషెంట్స్ దగ్గర నుండి తాను కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంటాడు. తనకు మ్యాజిక్స్ చేయడం కూడా తెలుసు. ప్యారిస్ లో ఒక అభినందన సభకు వెళ్లి అక్కడ ఒక డాక్టర్ ని హత్య చేస్తాడు. ఇంతకీ ఆ డాక్టర్ ని విజయ్ ఎందుకు హత్య చేశాడు ? విజయ్ నేపధ్యం ఏమిటి ? విజయ్ తల్లిదండ్రులు ఏమయ్యారు ? ఇంతకీ ఆ కిడ్నప్ లు హత్యలు చేసింది విజయ్ యేనా ? ఇవన్నీ తెలియాలంటే తెరపై సినిమా తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే :

ఒక మాస్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు (మంచి స్క్రిప్ట్, మాస్ ఇమేజ్ వున్న హీరో, రొమాన్స్, కామెడీ, అద్భుతమైన యాక్షన్ సీన్స్) సమపాళ్లలో ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. ఇది కొత్త స్టోరీ కాకపోయినప్పటికీ, దాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకునే కొడుకుల కధకి, ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే దోపిడీ వల్ల సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ ని కలిపి తెరకెక్కించిన సినిమానే ఈ “అదిరింది”. ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరికి “ఠాగూర్” సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇదొక రొటీన్ కధే అయినప్పట్టికీ విజయ్ తన నటనతో, దర్శకుడు అట్లీ తన స్క్రీన్ ప్లే తో మాయ చేశారు.

త్రిపాత్రాభినయం ఎంత కష్టమో అందరికి తెలుసు, విజయ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు చేయలేదు, అయినప్పటికీ ఈ సినిమాలో అయన తనని తాను మలుచుకున్న తీరు చాలా బాగుంది. సమంత, కాజల్ అగర్వాల్ పాత్రల్లో నటన ఎక్కువ స్కోప్ లేదు, కానీ నిత్యామీనన్ పాత్ర్రకి మాత్రం మంచి స్కోప్ ఉండడంతో, నిత్యామీనన్ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. నిత్యామీనన్ కనిపించే ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్, సున్నితమైన కామెడీ సీన్స్ సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

జి.కె విష్ణు కెమెరా పనితనం, రెహమాన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమాకి పెద్ద బలాలు. విల్లన్ గా ఎస్.జే సూర్య నటన ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో ఆయన నటన సినిమా సక్సెస్ కి ఉపయోగపడేలా వుంది. ఓవరాల్ గా ఈ “అదిరింది” సినిమా రొటీన్ స్టోరీ తో, మంచి స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్.

బలాలు :

  • విజయ్ నటన
  • స్క్రీన్ ప్లే
  • డైరెక్షన్
  • కెమెరా పనితనం
  • యాక్షన్
  • నేపధ్య సంగీతం

బలహీనతలు :

  • రొటీన్ స్టోరీ
  • తమిళ్ నేటివిటీ
  • యావరేజ్ సాంగ్స్

రేటింగ్: 3/5

Rating Explanation :

4.0 and Above  CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

 

Click here for Adhirindi Movie Review in English

Add Comment

Click here to post a comment