మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన జీవిత…!

Actress Jeevitha comments on Media: డ్రగ్స్ కేసులో కేవలం సినీ పరిశ్రమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని నటి జీవిత ప్రశ్నించారు. డ్రగ్స్ ఎవరు తీసుకున్న నేరమేనని, శిక్షిపడాల్సిందేనన్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల కొడుకులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని, కేవలం సినిమావాళ్లపైనే ఎందుకు పడుతున్నారని జీవిత ప్రశ్నించారు. సమాజంలో సినిమా పరిశ్రమ ఒక భాగమని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో సమాజం పట్ల బాధ్యత ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి పని చేసినా ఒకటికి పది సార్లు ఆలోచిస్తామని ఆమె చెప్పారు. అందరి కళ్లు మాదే ఉంటాయని తమకు తెలుసు కాబట్టే జాగ్రత్తగా ఉంటామని అన్నారు. ఒక సామాన్య వ్యక్తి ఏం చేసినా పట్టించుకోరని, అదే సినీ ఆర్టిస్టులు ఏం చేసిన ఆ విషయాన్ని మీడియా పెద్దగా చూపిస్తుందని జీవిత ఆరోపించారు.

READ MORE: ‘పటేల్ సర్’ రివ్యూ మరియు రేటింగ్

Add Comment

Click here to post a comment