పి.ఎస్.వి గరుడ వేగ మూవీ రివ్యూ

పి.ఎస్.వి గరుడ వేగ మూవీ రివ్యూ మరియు రేటింగ్

PSV Garuda Vega movie review in Telugu

 • విడుదల తేదీ: నవంబర్ 3, 2017
 • పి.ఎస్.వి గరుడ వేగ మూవీ రేటింగ్ : 3.25/5
 • దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
 • నిర్మాత : ఎమ్.కోటేశ్వర రాజు, మురళి శ్రీనివాస్
 • సంగీతం : శ్రీచరణ్ పాకాల, భీమ్స్
 • నటీనటులు : రాజశేఖర్, పూజ కుమార్, శ్రద్ధా దాస్
 • బ్యానర్ : జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్
 • సినిమాటోగ్రఫీ : అంజి, సురేష్ రగుటు, శ్యామ్ ప్రసాద్, గిక చెలిడ్జి, బాకుర్ చికోబావ

చాలా కాలం తర్వాత రాజశేఖర్ ఓ పెద్ద బడ్జెట్ యాక్షన్ సినిమాలో నటించారు. వరుస పరాజయాలు వున్నా పట్టించుకోకుండా నిర్మాత కోటేశ్వర రాజు ఈ చిత్రం పై 30 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్ ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నారు, మరి ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఏ మేరకు నిలబెట్టగలదో మన రివ్యూలో చూద్దాం.

కథ:

చంద్రశేఖర్ (రాజశేఖర్) ఇండియన్ ఇంటలిజెన్స్ ఆఫీసర్. తాను చేసే పని ఏంటో తన భార్యకు తెలియదు, అందువల్ల ఫ్యామిలీ తో ఎక్కువ సమయం గడపడం లేదని గొడవ పడి విడాకులు కావాలని అడుగుతుంది. ఆ బాధ పడలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని తన పై అధికారికి చెప్పి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక హ్యాకర్ ని వెంటాడుతున్న ఓ కారు శేఖర్ కారుని ఢీ కొడుతుంది. వారి దగ్గర గన్స్ ఉండడం చూసి వారిని వెంబడిస్తాడు శేఖర్. అలా వెంబడించిన శేఖర్ కి ఒక్కో విషయం తెలుస్తుంది, చివరికి అదో పెద్ద కుంభకోణం కి దారితీస్తుంది. ఇంతకీ ఈ హ్యాకర్ ఎవరు ? అతడిని ఎవరు, ఎందుకు చంపాలనుకుంటారు ? శేఖర్ తెలుసుకున్న విషయాలు ఏంటి ? చివరికి ఆ కుంభకోణం గురించి ప్రజలకి ఎలా తెలుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసుకున్న స్టోరీ లైన్, దాన్ని ఒక కధగా మలిచి తెరకెక్కించిన తీరు చాలా గొప్పగా వుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రానికి వున్నాయి. చిత్రంలోని ప్రతి సీన్, ప్రతి ఫేమ్ చాలా రిచ్ గా వుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు, దర్శకుడి కష్టం ప్రతి సీన్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక టఫ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటన అద్భుతంగా వుంది, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆయన నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. హ్యాకర్ గా అదిత్ నటన ఆకట్టుకునే విధంగా వుంది.

ఈ సినిమాలో చెప్పుకోదగిన మరో అంశం, కధలోని సహజత్వం. హీరో పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ, కుటుంబానికి సమయం కేటాయించకపోతే వచ్చే సమస్యలు ఎలా వుంటాయో చక్కగా చూపించారు. పని – కుటుంబం ఈ రెండింటిని బాలన్స్ చెయ్యడానికి హీరో పడే ఇబ్బందిని చాలా బాగా చూపించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా మొదటి భాగాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం. మొదటి పది నిమిషాలలోనే సినిమా వేగం పుంజుకుంటుంది, అలా పెరిగిన వేగం ఇంటర్వెల్ వరకు తగ్గకుండా, పూర్తి యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాడు. సినిమా సెకండ్ హాఫ్ కూడా బాగున్నప్పటికీ, దర్శకుడు ఫస్ట్ హాఫ్ ని బాగా ఎలివేట్ చెయ్యడంతో, సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్లు అనిపిస్తుంది.

పూజా కుమార్ – రాజశేఖర్ ల మధ్య నడిచే కొన్ని సన్నివేశాలు, మొదటి భాగంలోని ఒక పాటని తీసేస్తే బాగుండేది. అవి సినిమా వేగాన్ని తగ్గించేలా వున్నాయి.బాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలలో చాలా లౌడ్ గా అనిపించినా, సినిమా ఎలివేట్ అవ్వడానికి బాగా సహాయపడింది. శ్రద్ధా దాస్, నాజర్ లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పృథ్వి కామెడీ ఫరవాలేదనిపించింది. ఓవరాల్ గా ఇది రాజశేఖర్ ని మళ్ళీ ట్రాక్ లో పెట్టే సినిమా.

బలాలు :

 • ఫస్ట్ హాఫ్
 • రాజశేఖర్ నటన
 • యాక్షన్ సన్నివేశాలు
 • దర్శకత్వం
 • స్క్రీన్ ప్లే
 • బాక్గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు :

 • కొద్దిగా స్లో అయిన సెకండ్ హాఫ్ (ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే)
 • పూజా కుమార్ – రాజశేఖర్ ల మధ్య నడిచే కొన్ని సన్నివేశాలు, ఒక పాట

రేటింగ్: 3.25/5

Click here for PSV Garuda Vega Review in TELUGU

Rating Explanation :

4.0 and Above  CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment