నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ

నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ మరియు రేటింగ్

Next Nuvve movie review in Telugu

Next Nuvve movie review and rating :

 • విడుదల తేదీ: నవంబర్ 3, 2017
 • నెక్స్ట్ నువ్వే మూవీ రేటింగ్ : 2.5/5
 • దర్శకత్వం : ప్రభాకర్ (ఈటీవి)
 • నిర్మాత : బన్నీ వాసు, అల్లు అరవింద్, జ్ఞానవేల్ రాజా మరియు వంశి
 • సంగీతం : సాయి కార్తీక్
 • నటీనటులు : ఆది, వైభవి, రష్మీ గౌతమ్
 • బ్యానర్ : వి4 మూవీస్

కథ:

కిరణ్ (ఆది) ఒక సీరియల్ డైరెక్టర్. అతను తీస్తున్న సీరియల్ ని కొన్ని అనివార్య కారణాల వళ్ళ ఆపేస్తారు. అప్పుడు అతను తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వమని అప్పుల వాళ్ళు అడుగుతారు. అదే సమయంలో అతనికి ఒక కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ లో అతని నాన్న కిరణ్ గతం గురించి చెప్పి అతనికి ఒక ప్యాలెస్ ఉందని దాని గురించి డీటెయిల్స్ కావాలి అంటే శరత్ (బ్రహ్మాజీ)ని కలవమని చెప్తాడు. అప్పుడు కిరణ్ మరియు అతని గర్ల్ ఫ్రెండ్ స్మిత (వైభవి)తో కలిసి శరత్ దగ్గరకు వెళ్తే శరత్ వాళ్ళని ఆ ప్యాలెస్ దగ్గరకు తీసుకువెళ్తాడు. దానిని బాగు చేసి అందులో ఒక రిసార్ట్ స్టార్ట్ చేస్తాడు కిరణ్. ఆ రిసార్ట్ లో దిగిన ప్రతి ఒక్కరు చనిపోతారు. దానికి కారణం ఒక దెయ్యం అని కిరణ్ తెలుసుకుంటాడు. చివరికి వాళ్ళు, ఆ దెయ్యం ఎవరు? తాను ఎందుకు ఇలా ఐయ్యింది? అనేది తెలుసు కున్నారా? లేదా? కిరణ్ ఆ దెయ్యాన్ని తన రిసార్ట్ నుండి పంపించాం గలిగాడా? లేదా? అనేది మనం తెర పైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

ఆర్టిస్ట్ నుండి డైరెక్టర్ గా మారిన ప్రభాకర్ తమిళంలో హిట్ అయిన సినిమా ‘యామిరుక్క భయమే’ కథనే తన తెలుగు కథగా తీసుకున్నాడు. కానీ దానిని పూర్తి కథగా మార్చుకునే విషయంలోనే విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మన తెలుగు భాషలో ఎన్నో సక్సెస్ఫుల్ హార్రర్ సినిమాలు వచ్చాయి, ఈ సినిమా కూడా వాటి ధోరణిలోనే నడిచింది. కానీ ఈ సినిమా వాటి లాగా ఆకట్టుకునే రీతిలో లేదు, మరియు ఈ సినిమాకి పర్ఫెక్ట్ ఎండింగ్ అనేది చూపించడంలో డైరెక్టర్ ప్రభాకర్ విఫలం అయ్యాడు. కామెడీ పరంగా సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఆది మరియు బ్రహ్మాజీ మధ్య నడిచే కామెడీ సన్నివేశాలు మనల్ని కొంచెం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ద్వారా హీరో ఆది తన నటనలో చాలా పరిణతి కనబరిచాడు.

ఆది లవర్ పాత్రలో హీరోయిన్ వైభవి ఆకట్టుకుంది. ఇంకొక హీరోయిన్ రష్మీ గౌతమ్ ని మాత్రం కేవలం గ్లామర్ కోసమే పెట్టుకున్నారు అనిపిస్తుంది. సాయి కార్తీక్ అందించిన సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. అన్ని పాటలలోకి ‘అలా మేడ మీద’ అనే పాట కొంచెం ఆకట్టుకుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. సినీటోగ్రఫీ పర్వ లేదు అనిపించింది. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకా బాగా చేయ్యవచ్చు అనిపిస్తుంది. ఆర్ట్ డిపార్టుమెంట్ పనితనం మాత్రం చాలా బాగుంది. వి4 మూవీస్ వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఈ సినిమా కి ప్రధానమైన పాయింట్ కామెడీ మరియు హార్రర్. కామెడీ ని బాగానే పండించ గలిగాడు కానీ హార్రర్ తో భయపెట్టడంలో మాత్రం డైరెక్టర్ ప్రభాకర్ విఫలమయ్యాడు అని చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో కామెడీతో లాగించేసాడు కానీ అంతగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ మాత్రం పర్వాలేదు అనిపించింది.  ఓవరాల్ గా చెప్పాలంటే ఇదొక ఆకట్టుకోలేకపోయిన రోటీన్ హార్రర్ కామెడీ మూవీ.

బలాలు :

 • కామెడీ
 • బ్రహ్మాజీ
 • హీరోయిన్ల గ్లామర్

బలహీనతలు :

 •  రొటీన్ కంటెంట్
 • స్క్రీన్ ప్లే
 • ఆ దెయ్యం కథలో పర్ఫెక్ట్ ఎండింగ్ లేకపోవడం

రేటింగ్: 2.5/5

Click here for Next Nuvve Movie Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment