ఒక్కడు మిగిలాడు మూవీ రివ్యూ

Okkadu Migiladu movie review

ఒక్కడు మిగిలాడు మూవీ రివ్యూ

Okkadu Migiladu movie review and rating :

  • విడుదల తేదీ: నవంబర్ 10, 2017
  • ఒక్కడు మిగిలాడు మూవీ రేటింగ్ : 2.25/5 ( COULD STILL HAVE BEEN BETTER)
  • దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి
  • నిర్మాత : ఎస్.ఎన్ రెడ్డి, ఎన్. లక్ష్మి కాంత్
  • సంగీతం : శివ నందిగాం
  • నటీనటులు : మంచు మనోజ్, అనిషా అంబ్రోస్
  • బ్యానర్ : పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
  • సినిమాటోగ్రఫీవి.కె రామరాజు

కథ:

సూర్య (మంచు మనోజ్) చిన్నతనంలోనే భారతదేశానికి వచ్చిన ఒక శరణార్థి. అతను పెరిగి పెద్దయ్యి ఒక యూనివర్సిటీ లో చదువుతూ ఉంటాడు. ఆ యూనివర్సిటీలో ఒక ముగ్గురు అమ్మాయిలకి జరిగిన అన్యాయానికి అతను ఎదురుతిరుగుతాడు. ఆ సంఘటనతో మినిస్టర్ కొడుకులకి సంబంధం ఉండటం వాళ్ళ సూర్యకి పోలీసులనుండి చుక్కెదురవుతుంది. సూర్యకి స్వర్ణ (అనిషా అంబ్రోస్) అనే ఒక న్యూస్ రిపోర్టర్ సపోర్ట్ దొరుకుతుంది. స్వర్ణ సహాయంతో సూర్య ఆ అమ్మాయిలకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగాడా? లేదా? అసలు సూర్య ఈ దేశానికి శరణార్థిగా ఎందుకు వచ్చాడు? అతని గతం ఏంటి? అనేది మనం తెర పైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కొత్త డైరెక్టర్ అజయ్ ఆండ్రూస్ నూతక్కి ఈ సినిమాని తమిళ నేటివిటికి సంబంధం వున్న LTTEనే తన కథకు మెయిన్ పాయింట్ కింద తీసుకున్నారు. మంచు మనోజ్ నటన ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్. ఈ సినిమాలో మనోజ్ తన నటనలో వున్న వేరియేషన్స్ ని బాగా చూపించగలిగాడు. సంగీత దర్శకుడు శివ నందిగాం అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుందనే చెప్పాలి. ఈ సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ అనేది ఉంది అంటే అది సినిమా ఆసాంతం వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు మంచు మనోజ్ నటన.

డైరెక్టర్ కధని ఆసక్తికరంగా తెరకెక్కించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి. ఎందుకంటే కధనంలో చాలా లాగ్ ఉండటం దానికి ప్రధాన కారణం, మరియు సినిమా మొత్తం అంత ఇంటరెస్టింగ్ గా అనిపించని ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా ఉండటం ఇంకొక కారణం. ఈ సినిమా లో మరో ప్రధాన లోపం సెకండ్ హాఫ్ లో దాదాపు 30 నిమిషాలు సముద్రం మీద నడిచే బోట్ సీన్స్, ఆ సన్నివేశాలను ఇంకా భావోద్వేగభరితంగా తెరకేకించి ఉంటే బాగుండేది.

హీరోయిన్ అనిషా అంబ్రోస్ కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యింది అనే చెప్పాలి. సినిమాలో పాటలు లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఒక పాట కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. వి.కె రామరాజు అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్మాణ విలువలు బాగున్నా వాటిని సక్సెస్ చేసుకునే విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.

బలాలు :

  • మనోజ్ నటన
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు :

  • కధనం
  • స్టోరీలో లాగ్
  • హింస ఎక్కువ ఉండటం

రేటింగ్: 2.25/5 ( COULD STILL HAVE BEEN BETTER)

Click here for Okkadu Migiladu Movie Review in English

Rating Explanation :

4.0 and Above  CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment