ఏంజెల్ మూవీ రివ్యూ

ఏంజెల్ మూవీ రివ్యూ

Angel movie review in Telugu

Angel movie review and rating :

  • విడుదల తేదీ: నవంబర్ 3, 2017
  • ఏంజెల్ మూవీ రేటింగ్ : 2.5/5
  • దర్శకత్వం : పళని
  • నిర్మాత : ఠాగూర్ మధు
  • సంగీతం : భీమ్స్
  • నటీనటులు : నాగ అన్వేష్, హెబ్బా పటేల్
  • బ్యానర్ : సరస్వతి ఫిలిమ్స్
  • సినిమాటోగ్రఫీ : గుణశేఖరన్

 

కథ:

అమరావతి తవ్వకాల్లో ఒక అరుదైన విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా మరో చోటికి చేర్చమని నాని (నాగ అన్వేష్) గిరి (సప్తగిరి) లకు పిలుపు వస్తుంది. వారు ఆ పనిలో ఉండగా నక్షత్ర (హెబ్బా పటేల్) నానికి పరిచయం అవుతుంది. నక్షత్ర ఒక గంధర్వ కన్య. గంధర్వ లోకంలో నివసించే ఆమె భూలోకమునకు వచ్చి ఉండేందుకు ఇష్టపడుతుంది. ఆమె భూలోకమునకు వచ్చాక ఏం జరిగింది ? నానితో ఎలా ప్రేమలో పడింది ? నాని, నక్షత్ర పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది మనం తెరపైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

దర్శకుడు బాహుబలి పళని ప్రేక్షకుడిని ఆకట్టుకునే సోషియో ఫాంటసీ కథనే తన సినిమాకి ప్రధాన అంశంగా తీసుకున్నారు. కానీ దర్శకుడు బాహుబలి పళని ఆ కథని కధనంగా మార్చుకోవడంలోనే విఫలం అయ్యాడు. దర్శకుడు సరైన కథనాన్ని, ఆకట్టుకునే సన్నివేశాలని, కామెడీ ట్రాక్ ను సరైన టైమింగ్ లో వాడుకోలేకపోవడం వలన ఈ సినిమా మనల్ని ఆకట్టుకోలేక పోయింది.

ఈ సినిమాలో నాగ అన్వేష్ నటన పరంగా బాగానే చేశాడు. మొదటి సినిమాకి, ఈ సినిమాకు పరిణితి చూపించాడు. మాస్ యాంగిల్ లో బెటర్ గానే ఎక్స్పోజ్ అయ్యాడు. హీరో స్నేహితుడిగా సప్తగిరి చేసిన కామెడి అక్కడక్కడా నవ్వించింది. సెకండ్ హాఫ్ లోని ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కొద్దిపాటి కామెడీ ట్రాక్ వర్కవుట్ అయింది. హెబ్బా పటేల్ కూడా తన పాత్రలో బాగానే నటించింది. లుక్స్ పరంగా కూడా అందంగా కనబడుతూ ఆకట్టుకుంది. కబీర్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే వారి పరిధి మేరకు నటించారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు గొప్పగా లేవు. నేపధ్య సంగీతం అక్కడక్కడ బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. గంధర్వ లోకంలో సన్నివేశాలు బాగా చిత్రికరించారు సినిమాటోగ్రఫర్. ఎత్నిక్ క్రియేటివ్ స్టూడియోస్ వారి సీజీ వర్క్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా ఈ ‘ఏంజెల్’ చిత్రం అక్కడక్కడా మాత్రమే మెప్పించి చాలా చోట్ల నిరుత్సాహపరిచేదిగా ఉందని చెప్పొచ్చు.

బలాలు :

  • హీరో, హీరోయిన్ల నటన
  • సప్తగిరి కామెడీ ట్రాక్
  • సినిమా క్లైమాక్స్

బలహీనతలు :

  •  కథనం
  • టేకింగ్
  • కథకు అవసరంలేని సీన్స్
  • ప్రీ క్లైమాక్స్

రేటింగ్: 2.5/5

Click here for Angel Movie Review in English

Rating Explanation :

4.0 and Above – CLASSIC

3.75 Rating  – MASTERPIECE

3.5 Rating  – BLOCKBUSTER

3.25 Rating – SUPER HIT (Must Watch)

3.0 Rating – Hit (Try Not To Miss)

2.75 Rating – ABOVE AVERAGE (Worth Your Money)

2.5 Rating – AVERAGE

2.25 Rating – COULD STILL HAVE BEEN BETTER

2.0 Rating – LOTS TO IMPROVE

Add Comment

Click here to post a comment